KTR: సీఎం రేవంత్ ఐరన్‌లెగ్
ABN, Publish Date - Feb 09 , 2025 | 04:23 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిది ఐరెన్ లెగ్ అని, ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా తెచ్చారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో ప్రచారం చేసి కాంగ్రె్‌సకు గుండుసున్నా తెచ్చిండు
బీజేపీకిఅతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే.. ఆ పార్టీని గెలిపిస్తుండు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిది ఐరెన్ లెగ్ అని, ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా తెచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పతనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో ముగించారని, రాబోయే రోజుల్లోనూ ఇదే పద్ధతి కొనసాగుతుందని విమర్శించారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో సిర్పూర్ కాగజ్‌నగర్, వికారాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ శనివారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భం గా ఢిల్లీ ఫలితాలపై మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోదీకి, బీజేపీకి అతిపెద్ద కార్యకర్తగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రాహుల్ బీజేపీని గెలిపించి వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. ప్రజలు తిట్టే తిట్లకు రేవంత్ కాకుండా వేరొకరైతే ఆత్మహత్య చేసుకునేవారని అన్నారు. ప్రజాశీర్వాదంతో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు.
కాంగ్రెస్ దగా ప్రజలకు అర్థమైంది
కాంగ్రె్‌సకు ఓటేస్తే రైతుబంధుకు రామ్‌రామ్... అని నాడు కేసీఆర్ చేసిన హెచ్చరిక నిజమైందని కేటీఆర్ అన్నారు. ఏడాది తిరిగే సరికే కాంగ్రెస్ దగా నైజం ప్రజలకు అర్థమైందని చెప్పారు. వికారాబాద్‌లో పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు కారణంగానే మెతుకు ఆనంద్ ఓడిపోయాడని అన్నారు. ప్రజాపాలన అని చెప్పే రేవంత్.. సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకే మైక్ ఇచ్చేందుకు వణికిపోతున్నారని కేటీఆర్ అన్నారు. ఇక, శతశాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని గతంలో తాను చెప్పిన మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 25 శాతం రుణమాఫీ కూడా జరగలేదని, రుణ మాఫీకి రూ.49,500 కోట్లు కావాలని బ్యాంకర్ల సమావేశంలో చెప్పిన సీఎం... విలేకరుల సమావేశం లో రూ.40 వేల కోట్లు అన్నారని, మంత్రివర్గ సమావేశంలో రూ.31వేల కోట్లు అన్నారని గుర్తు చేశారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్‌లో రూ.26వేల కోట్లు అన్నారని, మహబూబ్‌నగర్ సభలో రుణమాఫీ మొత్తం చేశానని రూ.18 వేల కోట్లు ఇచ్చారని చెప్పారన్నారు. కానీ, ఇప్పటిదాకా రూ.11 వేల కోట్లు కూడా ఖాతాలలో పడలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని కేటీఆర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
MLC Kavitha: కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు
Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ
Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 09 , 2025 | 04:23 AM