Share News

Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:17 PM

Supreme Court: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోడానికి ఇంకెంత సమయం కావాలంటూ తెలంగాణ స్పీకర్‌ను సుప్రీం సూటిగా ప్రశ్నించింది.

Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణలో (Telangana) పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో (Supreme Court) శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో చెప్పినా ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని కౌషిక్‌ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తగిన సమయంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదని న్యాయవాది తెలిపారు.


ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి.. కోర్టుకు చెప్పారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రోహత్గి గుర్తు చేశారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి... మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ?’’ అంటూ తెలంగాణ స్పీకర్‌ను సుప్రీం ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. స్పీకర్‌ను అడిగి నిర్ణయం చెపుతామని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఎంత సమయం కావాలో మీరే స్పీకర్‌ను కనుక్కొని చెప్పాలని రోహత్గికి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

CM Chandrababu: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలు సీఎం కీలక సూచనలు


సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావుపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద ఈ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి కడియం, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావు సహా పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీనిపై జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తెల్లం, కడియం, దానంపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వలేదని పిటిషన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

దేవదాసులూ.. మీకో బంపరాఫర్..

Osmania Hospital: ఉస్మానియా నూతన ఆస్పత్రికి సీఎం శంకుస్థాపన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 01:17 PM