KTR: నిధులు రాహుల్‌కు.. నీళ్లు చంద్రబాబుకు
ABN, Publish Date - Jul 17 , 2025 | 03:46 AM
ముసుగు వీడింది.. నిజం తేటతెల్లమైంది.. రేవంత్‌రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయింది. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు ధారదత్తం చేస్తున్నారు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఇంకెందుకు రెండు రాష్ట్రాలు.. ఇద్దరు సీఎంలు: కేటీఆర్
హైదరాబాద్, జులై 16 (ఆంధ్రజ్యోతి): ‘ముసుగు వీడింది.. నిజం తేటతెల్లమైంది.. రేవంత్‌రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయింది. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు ధారదత్తం చేస్తున్నారు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేకిని గెలిపించినందుకు ప్రజలకు బూడిదే మిగిలిందని పేర్కొన్నారు. ‘‘ఇంకెందుకు రెండు రాష్ట్రాలు.. ఇద్దరు సీఎంలు.. సరిహద్దులు చెరిపేసి నీ అక్కసు చల్లార్చుకో.. జై తెలంగాణ అనాల్సిన బాధ నీకు తప్పుతుందేమో! ఒక్క మాట గుర్తుపెట్టుకో.. ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి కొడతాం! ప్రాంతం వాడే మోసం చేస్తే ఇక్కడే పాతిపెడతాం.. తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని పడతాం’’ అని వ్యాఖ్యానించారు.
రేవంత్‌రెడ్డికి దమ్ముంటే నాగార్జునసాగర్ కట్టమీద కాదు.. మేడిగడ్డ బ్యారేజీ మీద చర్చకు రావాలని సవాల్ విసిరారు. దళితబంధుపై పెట్టిన ఫ్రీజింగ్‌ను వెంటనే తొలగించి దళిత బిడ్డలకు న్యాయం చేయాలని డిపాండ్ చేశారు. రాజకీయాల్లో బూతులు మాట్లాడడం తమకు ఇష్టం లేదని, కానీ రేవంత్‌కు ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుందని ఇలా మాట్లాడాల్సి వస్తుందని అన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 03:46 AM