KTR: సీఎం రమేశ్‌కు 1600 కోట్ల కాంట్రాక్టు..!
ABN, Publish Date - Jul 26 , 2025 | 04:56 AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో రేవంత్‌రెడ్డికి మద్దతిచ్చి.. కమీషన్లు ఇప్పించిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు క్విడ్‌ప్రోకో కింద రాష్ట్ర ముఖ్యమంత్రి వందల కోట్ల కాంట్రాక్టు కట్టబెడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రేవంత్ అప్పగిస్తుంటే కళ్లుమూసుకున్న రాహుల్ గాంధీ
రాష్ట్రాన్ని దోచుకుంటున్న రేవంత్‌రెడ్డిని మోదీ ప్రభుత్వం కాపాడుతోంది: కేటీఆర్
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో రేవంత్‌రెడ్డికి మద్దతిచ్చి.. కమీషన్లు ఇప్పించిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు క్విడ్‌ప్రోకో కింద రాష్ట్ర ముఖ్యమంత్రి వందల కోట్ల కాంట్రాక్టు కట్టబెడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ (టీఆర్‌వీఎ్‌సపీ)ను బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగంలో విలీనం చేసిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడారు. బీజేపీ ఎంపీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోర్త్‌సిటీలో రూ.1600 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులిస్తుంటే.. రాహుల్‌గాంధీ కళ్లు మూసుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్న రేవంత్‌రెడ్డిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు.
రేవంత్ సర్కార్ అక్రమాలు, అవినీతిని నిరూపించే సాక్ష్యాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల రాజకీయ అక్రమ సంబంధం నిస్సిగ్గుగా నడుస్తోందని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి బీజేపీ పెద్దల ఆశీస్సులుంటే ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజల మద్దతు ఏమాత్రం లేదన్నారు. సోనియాగాంధీ తనకు రాసిన లేఖను చదివే తెలివి కూడా రేవంత్‌కు లేదనిపిస్తోందన్నారు. కార్యక్రమానికి రాలేనని లేఖలో ఆమె చెప్పినమాటను అర్థం చేసుకోలేక తనను ప్రశంసించారని, అది ఆస్కార్ అవార్డుతో సమానమంటున్న ఆయనకు ఆస్కార్‌కాదు.. భాస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణలోని యూనివర్సిటీల విద్యార్థుల పోరాట ఫలితంగా.. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గడగడలాడి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో దళితబిడ్డ సాయిలును రేవంత్‌రెడ్డి పోలీసులు ఎక్కడ అవమానించారో అక్కడే.. ఆయనకు సన్మానంచేసి అధికారులకు ఓ హెచ్చరిక చేశామని కేటీఆర్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 04:56 AM