Konda Surekha: అటవీ చట్టాల పేరిట గిరిజనుల్ని ఇబ్బంది పెట్టొద్దు: కొండా సురేఖ
ABN, Publish Date - May 25 , 2025 | 04:26 AM
అటవీ చట్టాల పేరిట గిరిజనులను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచించారు. గిరిజనుల అభివృద్ధికి అటవీ శాఖ ఉన్నతాధికారులు సహకరించాలన్నారు.
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): అటవీ చట్టాల పేరిట గిరిజనులను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచించారు. గిరిజనుల అభివృద్ధికి అటవీ శాఖ ఉన్నతాధికారులు సహకరించాలన్నారు. కనీస సౌకర్యాలైన రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, తాగునీరు, కరెంటు లైన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం సచివాలయంలో శనివారం జరిగింది.
మంత్రి సురేఖ మాట్లాడుతూ.. గిరిజనుల బతుకులు మారాలంటే ఆయా ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను విస్తృతంగా చర్చించి, ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలని అటవీ అధికారులను ఆదేశించారు..
Updated Date - May 25 , 2025 | 04:26 AM