Konda Surekha: రాజన్న కోడెలపై రాజకీయం వద్దు: సురేఖ
ABN, Publish Date - Jun 07 , 2025 | 06:14 AM
వేములవాడ రాజన్న కోడెలపై రాజకీయం చేయవద్దని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాజన్న కోడెల దుస్థితికి కారణం కేసీఆర్ పాలనే అని ఆరోపించారు.
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజన్న కోడెలపై రాజకీయం చేయవద్దని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాజన్న కోడెల దుస్థితికి కారణం కేసీఆర్ పాలనే అని ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో రాజన్న ఆలయ అభివృద్ధికి చేసిందేమి లేదన్నారు. కోడెల ఘటన జరిగిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించిందని, తగిన చర్యలు చేపట్టి ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
అయినా ప్రతిపక్షాలు ఈ విషయంలో బురద రాజకీయం చేయడం సరికాదని విమర్శించారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాస్తానని దేవుడిని మోసం చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌ది కాదా అని ప్రశ్నించారు.
Updated Date - Jun 07 , 2025 | 06:14 AM