ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.1,000 కోట్లతో ఏఎమ్మార్పీ కాల్వల మరమ్మతులు: మంత్రి కోమటిరెడ్డి

ABN, Publish Date - Mar 17 , 2025 | 04:18 AM

రూ.1000 కోట్లతో ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వల డిస్ట్రిబ్యూటరీ లైనింగ్‌, మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

నల్లగొండ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రూ.1000 కోట్లతో ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వల డిస్ట్రిబ్యూటరీ లైనింగ్‌, మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా నల్లగొండ నియోజకవర్గంలోని పలు చెరువులను పరిశీలించిన మంత్రి సాగునీటి పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాన కాల్వ లైనింగ్‌ పనులు చేపట్టేందుకు రూ.850 కోట్లు, మరో రూ.350కోట్లతో డిస్ట్రిబ్యూటరీ మరమ్మతులకు టెండర్లను పిలవనున్నట్లు తెలిపారు.


ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ఆయకట్టు సుమారు 2 లక్షల 20వేల ఎకరాలకు స్థిరీకరించగా ఇప్పటివరకు 2 లక్షల 15 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పంట పొలాలు కోత దశలో ఉన్నందున సాగునీటిని అందిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 04:18 AM