ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pharma City: గజ్వేల్‌లో ఫార్మాసిటీ ఎందుకు పెట్టలేదు..?

ABN, Publish Date - Mar 28 , 2025 | 03:38 AM

గత ప్రభుత్వ హయంలో ఫార్మా సిటీ పేరుతో రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఫార్మా సిటీ పేరుతో నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని, దానికి వ్యతిరేకంగా తామే పోరాటం చేశామని చెప్పారు.

  • బీఆర్‌ఎస్‌ సభ్యుల్ని నిలదీసిన మంత్రి కోమటిరెడ్డి

గత ప్రభుత్వ హయంలో ఫార్మా సిటీ పేరుతో రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఫార్మా సిటీ పేరుతో నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని, దానికి వ్యతిరేకంగా తామే పోరాటం చేశామని చెప్పారు. గజ్వేల్‌లో ఫార్మాసిటీ ఎందుకు పెట్టలేదని బీఆర్‌ఎస్‌ సభ్యుల్ని మంత్రి ప్రశ్నించారు. గతంలో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఎఫ్‌టీఎల్‌లో ఉందన్న హరీశ్‌రావు.. వారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదని విమర్శించారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్‌ కన్వెన్షన్‌ను తొలగించిందని చెప్పారు. హైడ్రాను విమర్శించడం సరికాదన్నారు. నల్లగొండ ప్రజల నీటి కష్టాలు తొలగించేందుకు మూసీ ప్రక్షాళన చేపడితే విపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.

Updated Date - Mar 28 , 2025 | 03:38 AM