ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kodandaram: పోలీసుల దాడిని ఖండిస్తున్నాం

ABN, Publish Date - Apr 04 , 2025 | 03:57 AM

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తమ టీజేఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.

  • ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తమ టీజేఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే కొట్టివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏ యూనివర్శిటీలోనైనా విద్యార్థులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదన్నారు. చర్చల ద్వారానే ఆందోళనలకు పరిష్కారం లభిస్తుందన్నారు.


హెచ్‌సీయూకి సంబంధించి భూముల రక్షణ, పర్యావరణ పరిరక్షణ వేర్వేరు అంశాలన్నారు. ఈ రెండింటిని కలిపేయడం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. కంచన్‌గచ్చిబౌలి, దామగుండం విషయాల్లోనూ ఇదే జరిగిందని తెలిపారు. మరోసారి అధికారంలోకి వస్తామని కేటీఆర్‌ కలలు కంటున్నారని, కానీ అదెప్పటికీ జరగదని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 03:57 AM