ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kamma Community: కమ్మ కులంపై దుర్మార్గపు మాటలు బాధాకరం

ABN, Publish Date - Jul 28 , 2025 | 03:31 AM

బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ నేత కమ్మ కులంపై విమర్శలు చేసినట్టుగా ప్రచారం అవుతున్న దుర్మార్గపు మాటలు బాధాకరమని ఖమ్మం కమ్మ మహాజన సంఘం పేర్కొంది.

  • ఖమ్మం కమ్మ మహాజన సంఘం

ఖమ్మం ఖానాపురం హవేలి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ నేత కమ్మ కులంపై విమర్శలు చేసినట్టుగా ప్రచారం అవుతున్న దుర్మార్గపు మాటలు బాధాకరమని ఖమ్మం కమ్మ మహాజన సంఘం పేర్కొంది. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొల్లు రఘు సత్యనారాయణ, చావా రాము ఆదివారం ఓ ప్రకటన చేశారు. బీఆర్‌ఎస్‌ నేత ఒకరు కమ్మ కులంపై తనతో దారుణంగా మాట్లాడారని ఏపీకి చెందిన ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోందన్నారు.

సదరు బీఆర్‌ఎస్‌ నేత ఆ వ్యాఖ్యలు నిజంగా చేసుంటే వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కమ్మ కులం అనేది దేశ అభివృద్ధ్దికి, రాష్ట్ర ప్రగతికి అన్ని రంగాల్లో నిస్వార్థంగా సేవలందించిన సామాజిక వర్గమని వివరించారు. ఏ రాజకీయ పార్టీలో ఎవరున్నా కులాలపై విమర్శలు చేయడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 03:31 AM