డిసెంబరులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం
ABN, Publish Date - Jun 22 , 2025 | 05:10 AM
ఈ ఏడాది డిసెంబరు నాటికి కాజీపేటలోకోచ్ ఫ్యాక్టరీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని, వందేభారత్ బోగీల తయారీ కాస్త ఆలస్యం కావచ్చని రైల్వే జీఎం ఏకే జైన్ తెలిపారు.
రైల్వే జీఎం ఏకే జైన్
హైదరాబాద్, కాజీపేట, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది డిసెంబరు నాటికి కాజీపేటలోకోచ్ ఫ్యాక్టరీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని, వందేభారత్ బోగీల తయారీ కాస్త ఆలస్యం కావచ్చని రైల్వే జీఎం ఏకే జైన్ తెలిపారు. ఆయన శనివారం సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్‌తో కలిసి సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు రైలులో ప్రయాణించి ట్రాక్, వంతెనలను పరిశీలించారు.
అనంతరం కాజీపేట రైల్వేస్టేషన్‌లో నూతన క్రూ రన్నింగ్ రూమ్, పవర్ కంట్రోల్ రూమ్, డైనింగ్ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని క్రూ లాబీని, ఆర్‌ఆర్‌ఐ వ్యవస్థ పనితీరును తనిఖీ చేశారు. ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. అనంతరం జీఎం, డీఆర్‌ఎం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
Updated Date - Jun 22 , 2025 | 05:10 AM