Kavitha: వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు
ABN, Publish Date - May 27 , 2025 | 04:43 AM
కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు.
ఇబ్బందులెన్ని పెట్టినా కేసీఆర్ సైనికులు నిలబడగలరు: కవిత
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ క్రీడలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. తమ పార్టీ నాయకులకు వరుసగా నోటీసులు జారీ చేయడాన్ని రాజకీయ దురుద్దేశంగా ఆమె ‘ఎక్స్’లో అభివర్ణించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా, కేసీఆర్ సైనికులు తట్టుకొని నిలబడగలరని కవిత స్పష్టం చేశారు.
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..
Updated Date - May 27 , 2025 | 04:43 AM