Aadi Srinivas: కేసీఆర్ దేవుడైతే.. దెయ్యం ఎవరు?
ABN, Publish Date - May 24 , 2025 | 04:59 AM
కేసీఆర్ దేవుడు అయితే దెయ్యం ఎవరంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తన లేఖను ఎవరో బయటకు లీక్ చేశారంటూ విమానాశ్రయంలో కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
బీఆర్‌ఎ్‌సలో కోవర్టులెవరు.. కుట్రదారులెవరు?
కవితకు ప్రశ్నలు సంధించిన ఆది శ్రీనివాస్
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ దేవుడు అయితే దెయ్యం ఎవరంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తన లేఖను ఎవరో బయటకు లీక్ చేశారంటూ విమానాశ్రయంలో కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆమెకు 11 ప్రశ్నలు సంధిస్తూ.. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కవిత గారు.. మీ లేఖను లీక్ చేసిందెవరు.. కేసీఆర్ దేవుడైతే దెయ్యం ఎవరు.. కేసీఆర్ పక్కనున్న కోవర్టులెవరు..
బీఆర్‌ఎ్‌సలో మీపైన కుట్ర చేస్తున్నదెవరు.. సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది.. మీకు ఫాంహౌ్‌సలోకి ప్రవేశం లేదా..? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు.. లేఖ లీక్ కావడంపైవివరణ ఇవ్వాలని కేసీఆర్‌ని అడుగుతారా.. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు..? ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు అండగా నిలబడటం లేదు.. ఎయిర్‌పోర్టులో మీకు స్వాగతం పలకడానికి బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు రాలేదు.. మీ లేఖ నకిలీదని మీ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో రాయించిందెవరు..?’ అంటూ అడిగారు.
Updated Date - May 24 , 2025 | 04:59 AM