Kalvakuntla Kavitha: విదేశాల్లోనూ తెలంగాణ జాగృతి శాఖలు
ABN, Publish Date - Jun 30 , 2025 | 06:43 AM
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రవాస తెలంగాణ బిడ్డల సంక్షేమానికి కృషి చేయాలనే ఉద్దేశంతో వివిధ దేశాల శాఖలకు నూతన అధ్యక్షులను ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు
అధ్యక్షులను నియమించిన కవిత
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రవాస తెలంగాణ బిడ్డల సంక్షేమానికి కృషి చేయాలనే ఉద్దేశంతో వివిధ దేశాల శాఖలకు నూతన అధ్యక్షులను ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి, రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ అభ్యున్నతికి అంకితమైన సంస్థగా తెలంగాణ జాగృతి నిలిచిందని ఆదివారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బాధ్యతలు అప్పగించిన వారు తెలంగాణ అభ్యున్నతికి, ఆయా దేశాలలో ఉన్న తెలంగాణ ప్రవాసీల సంక్షేమానికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేయాలని సూచించారు. ఈ నియామకాలన్నీ వెంటనే అమలులోకి వస్తాయని తెలిపారు. త్వరలోనే ఆయా దేశాల్లో పూర్తి స్థాయి కమిటీలను ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.
Updated Date - Jun 30 , 2025 | 06:44 AM