Bhatti Vikramarka: కాశ్మీర్‌లో ఉగ్ర దాడి అమానుషం
ABN, Publish Date - Apr 24 , 2025 | 03:51 AM
కశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. 27 మంది హత్య చేయడం అమానుషం అని, ఇటువంటి ఘటనలకు దేశంలో తావు లేదన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 27మందిని పొట్టన పెట్టుకోవడం పట్ల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు దాడి చేసి పర్యాటకులను హత్య చేయడం అమానుషమని, ఇలాంటి సంఘటనలకు దేశంలో తావు లేదని పేర్కొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 03:51 AM