ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టీబీ రహిత రాష్ట్రం కోసం ప్రత్యేక చర్యలు

ABN, Publish Date - Mar 16 , 2025 | 12:26 AM

క్షయ రహిత రాష్ట్రంగా నిల పేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ క్షయ నివారణ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశం అన్నారు. గర్రెపల్లి ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధిగ్రస్తులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

సుల్తానాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): క్షయ రహిత రాష్ట్రంగా నిల పేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ క్షయ నివారణ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశం అన్నారు. గర్రెపల్లి ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధిగ్రస్తులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వ్యాధిగ్ర స్తులు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడానికి కేంద్ర ప్రభుత్వం వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా 347, రాష్ట్రంలో 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేయగా గర్రెపల్లి పీహెచ్‌సీ ఉందన్నారు. ఎంపిక చేసిన పీహెచ్‌సీల పరిధిలో అనుమానితులను గుర్తించి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, పౌష్టికాహారం ఇస్తూ పర్యవేక్షిస్తామన్నారు.

డీఎంహెచ్‌వో డాక్టర్‌ అన్న పసన్నకుమారి మాట్లాడుతూ మందులు సక్రమంగా వాడుతు పౌష్టికా హారాన్ని తీసుకోవాలన్నారు. జిల్లా పరిధిలో 500 మంది క్ష వ్యాధిగ్రస్థు లకు స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఫణిశంకర్‌ సేవా దృక్పథంతో రూ.25 లక్షలతో ఆరు నెలలకు సరిపడా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని చెప్పారు. వీటిని అభయ పౌండేషన్‌ ద్వారా రోగులకు పంపిణీ చేస్తున్నారన్నారు. ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మం దులతో పాటు పౌష్టికాహారాన్ని తీసుకుని క్షయను దూరం చేసుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్‌ ఉదయ్‌తోపాటు అభయ పౌండేషన్‌కు చెందిన స్వామి బాలచంద్ర డాక్టర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:26 AM