ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: ప్రభుత్వాస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న కలెక్టర్‌

ABN, Publish Date - Jun 17 , 2025 | 04:54 AM

కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. కొన్నేళ్లుగా సైనసైటీ్‌సతో ఇబ్బంది పడుతున్న ఆమె ఇటీవల జిల్లా జనరల్‌ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు.

  • అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌

సుభాష్‌‌నగర్‌ (కరీంనగర్‌), జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. కొన్నేళ్లుగా సైనసైటీ్‌సతో ఇబ్బంది పడుతున్న ఆమె ఇటీవల జిల్లా జనరల్‌ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. వారు పరీక్షల అనంతరం శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్‌ రవికాంత్‌ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కలెక్టర్‌ను ప్రశంసించారు.

ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలతో పాటు అనుభవమున్న వైద్యసిబ్బంది ఉన్నారని, శస్త్రచికిత్స చేయించుకుని ప్రజల్లో ప్రభుత్వాసుపత్రులపై నమ్మకాన్ని పెంచారని సీఎం రేవంత్‌ ‘ఎక్స్‌’ వేదికగా అభినందించారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం కలెక్టర్‌ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరారెడ్డి తెలిపారు.

Updated Date - Jun 17 , 2025 | 04:54 AM