ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram Project: త్వరలో కాళేశ్వరంపై సర్కారుకు నివేదిక

ABN, Publish Date - Jun 13 , 2025 | 04:23 AM

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై జస్టిస్‌ పినాకి చ ంద్రఘోష్‌ కమిషన్‌ విచారణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గతేడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్‌ వేయగా... దాదాపు 115 మంది సాక్షులను కమిషన్‌ విచారించింది.

  • తుది దశకు బ్యారేజీల విచారణ

  • నేడు కోల్‌కతాకు పీసీ ఘోష్‌

హైదరాబాద్‌, వెంకటాపూర్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై జస్టిస్‌ పినాకి చ ంద్రఘోష్‌ కమిషన్‌ విచారణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గతేడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్‌ వేయగా... దాదాపు 115 మంది సాక్షులను కమిషన్‌ విచారించింది. బ్యారేజీల నిర్మాణంలో కీలకమైన మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించడంతో సాక్షుల విచారణ ప్రక్రియ ముగిసినట్లయింది. నివేదిక ముసాయిదాను సిద్ధం చేసుకున్నాకే... కేసీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను విచారించారు. దీంతో నివేదికకు తుది రూపు ఇవ్వనున్నారు. ఈనెల 4న విచారణ నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ శుక్రవారం కోల్‌కతాకు తిరిగి వెళ్లనున్నారు. త్వరలోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నారు. కాగా, కమిషన్‌ గడువు జూలై 31వ తేదీతో ముగియనుంది.

రామప్ప ఆలయ సందర్శన, పూజలు

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని జస్టిస్‌ పినాకి చ ంద్రఘోష్‌ గురువారం సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ శిల్పకళా సంపదను వీక్షించి చరిత్ర, విశిష్టత గురించి గైడ్‌లను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jun 13 , 2025 | 04:23 AM