ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KA Paul: బీజేపీ ఈటలను వాడుకుని వదిలేసింది

ABN, Publish Date - Jul 09 , 2025 | 07:10 AM

ఈటల రాజేందర్‌ను బీజేపీ వాడుకుని వదిలేసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు.

  • కవిత బీసీ నినాదం వెనుక బీజేపీ: కేఏ పాల్‌

న్యూఢిల్లీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఈటల రాజేందర్‌ను బీజేపీ వాడుకుని వదిలేసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు. బీసీని రాష్ట్ర అధ్యక్షుడినే చేయని బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు దింపేసిందని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌ వంటి బీసీలను కాదని బ్రాహ్మణుడైన రాంచందర్‌రావుకు అవకాశం కల్పించారని చెప్పారు. బ్రాహ్మణులకు తాను వ్యతిరేకిని కాదని, కానీ బీజేపీ బీసీ ము సుగు వేసుకుని ఇలాంటి చర్యలెలా చేస్తుందని ప్రశ్నించారు. ఒక్కసారి జైలులో పెట్టేసరికే కల్వకుంట్ల కవిత బీజేపీ గానం చేస్తోందని, జూబ్లీహి ల్స్‌ ఎన్నిక కోసమే కవితను బీసీ నినాదంతో రంగంలోకి దించారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని చప్పారు.

Updated Date - Jul 09 , 2025 | 07:10 AM