ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Justice Chandrakumar: నక్సల్స్‌పై దమన కాండ సరికాదు

ABN, Publish Date - Apr 29 , 2025 | 03:50 AM

ఆపరేషన్‌ కగార్‌ను నిలిపి మావోయిస్టులతో చర్చలు జరపాలని జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివాసులపై దమనకాండ సరికాదని, శాంతి చర్చలు ప్రారంభించాలని పీస్‌ కమిటీ నేతలు అభిప్రాయపడ్డారు

ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ కగార్‌ను నిలిపేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల పీస్‌ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపకుండా ఆదివాసీలపై దమనకాండకు పాల్పడుతున్నాయని, ఇది ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. ఆదివాసుల సంక్షేమం దృష్ట్యా పోలీసులు, మావోయుస్టులు శాంతిని పాటించాలని శాంతి చర్చల కమిటీ ఉపాధ్యక్షుడు జంపన్న కోరారు. ఆదివాసీల రాజ్యాంగ హక్కులను కాపాడాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు

Updated Date - Apr 29 , 2025 | 03:50 AM