రెరా అప్పీలేట్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా సంతోష్ రెడ్డి
ABN, Publish Date - Jun 17 , 2025 | 03:38 AM
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అప్పీలేట్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా జస్టిస్ ఎ.సంతోష్ రెడ్డిని నియామకమయ్యారు.
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అప్పీలేట్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా జస్టిస్ ఎ.సంతోష్ రెడ్డిని నియామకమయ్యారు. ఈ మేరకు పురపాలక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో చైౖర్మన్‌గా పనిచేసిన జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి లోకాయుక్త చైౖర్మన్‌గా వెళ్లడంతో తాత్కాలిక చైౖర్‌పర్సన్‌గా చిత్రా రామచంద్రన్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా అప్పీలేట్ ట్రైబ్యునల్ చైౖర్మన్‌గా జస్టిస్ ఎ.సంతోష్ రెడ్డిని నియమిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి కె.ఇలంబర్తి సోమవారం ఉత్తర్వులిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 17 , 2025 | 03:38 AM