ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jurala Project: జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు

ABN, Publish Date - May 29 , 2025 | 07:44 PM

జూరాల ప్రాజెక్టు భారీగా వరద చేరడంతో ప్రాజెక్ట్ అధికారులు 10 గేట్లు ఎత్తి 66 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జాలర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Jurala

మహబూబ్‌నగర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్ట్‌కు క్రమంగా వరద పెరుగుతోంది. ఇన్ ఫ్లో 40 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,559 క్యూసెక్కులు ఉన్నట్లు తెలుస్తోంది . రేపటి లోపు లక్ష క్యూసెక్కులకు వరద చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం..317.360 మీటర్లు ఉంది.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ 7.379 టీఎంసీలు ఉంది. ఈ కారణంగా నేడు స్పిల్ వే గేట్స్ తెరిచే అవకాశం కనిపిస్తోంది. జూరాల ప్రాజెక్టు భారీగా వరద చేరడంతో ప్రాజెక్ట్ అధికారులు 10 గేట్లు ఎత్తి 66 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జాలర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, మే నెలలో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి.


Also Read:

సింగరేణి వైద్యులూ.. మీ సామర్థ్యం నిరూపించుకోండి.. సీఎండీ బలరామ్ కీలక వ్యాఖ్యలు..

రాజకీయాల్లో ప్రకంపనలు సహజం: బోయినపల్లి వినోద్ కుమార్

For More Telugu News

Updated Date - May 29 , 2025 | 07:47 PM