Boinapalli Vinod Kumar: రాజకీయాల్లో ప్రకంపనలు సహజం: బోయినపల్లి వినోద్ కుమార్
ABN , Publish Date - May 29 , 2025 | 06:08 PM
ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌పై మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని తెలిపారు. చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చూశామని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అగ్రనేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత వ్యాఖ్యలకు గానూ షోకాజ్ నోటీసులు ఇచ్చారనే ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) క్లారిటీ ఇచ్చారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన విషయంలో కవితకు షోకాజ్ నోటీసు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తామని అన్నారు బోయినపల్లి వినోద్ కుమార్.
రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చూశామని అన్నారు. తమ పార్టీ మొదటిది కాదని.. చివరిది కాదని చెప్పుకొచ్చారు. ఇవాళ(గురువారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడారు. పార్లమెంట్‌లో కరుణానిధి, అళగిరి, కనిమొళి ఫ్యామిలీల రాజకీయాలు చూశామని అన్నారు. ఎమ్మెల్సీ కవితలో అంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడే చూశానని చెప్పారు. పార్టీలోని సమస్యలు త్వరలోనే ఖచ్చితంగా సద్దుమణుగుతాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి పనిచేసిందని గుర్తుచేశారు. ఒక్క బీజేపీతో మాత్రమే పని చేయలేదని.. ఆ పార్టీతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునేవాళ్లమని బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
కవిత ఎపిసోడ్‌పై సబితా ఇంద్రారెడ్డి ఏమన్నారంటే..
కవిత ఎపిసోడ్‌పై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. కవిత ఏం మాట్లాడిందో తాను చూడలేదని అన్నారు. నియోజకవర్గం నుంచి నేరుగా తాను హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. ఆ విషయంపై పార్టీ హై కమాండ్ స్పందిస్తుందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest Telangana News And Telugu News