ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhudan Land: నాగారం భూదాన్‌ భూముల అంశంపై.. హైకోర్టులో పలువురు ఐపీఎస్‌ల పిటిషన్లు

ABN, Publish Date - Apr 30 , 2025 | 04:56 AM

భూదాన్‌ భూములుగా పేర్కొంటున్న వాటిని నిషేధిత జాబితాలో పెట్టాలన్న ఉత్తర్వులను కొట్టేయాలని మంగళవారం పలువురు ఐపీఎ్‌సలు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): భూదాన్‌ భూములుగా పేర్కొంటున్న వాటిని నిషేధిత జాబితాలో పెట్టాలన్న ఉత్తర్వులను కొట్టేయాలని మంగళవారం పలువురు ఐపీఎ్‌సలు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్లలో మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, రవిగుప్తా, తరుణ్‌జోషి, రేణుగోయెల్‌, బీకే రాహుల్‌ హెగ్డే, రాహుల్‌ బుసిరెడ్డి, వీరన్నగారి గౌతమ్‌రెడ్డి, రేఖా షరాఫ్‌ తదితరులు ఉన్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూముల రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడంతో పాటు ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ బిర్ల మల్లేశ్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయంలో వారితో రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.


దీంతో నాగారంలోని 180, 182, 194, 195 తదితర సర్వే నెంబర్లలోని 26 ఎకరాల ప్రభుత్వ భూదాన్‌ భూముల లావాదేవీలపై స్టే విధించడంతో పాటు నిషేధిత జాబితాలో చేర్చాలని జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం ఈ నెల 24న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఈ ఉత్తర్వులను కొట్టేయాలని పలువురు ఐపీఎస్‌ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం డివిజన్‌ బెంచ్‌లో రిట్‌ అప్పీళ్లు దాఖలు చేశారు. బిర్ల మల్లేశ్‌ తన వ్యక్తిగత ప్రైవేటు భూవివాదంపై రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం అక్రమమని అధికారులు అప్పీళ్లలో పేర్కొన్నారు. తాము సేల్‌డీడ్‌ ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశామని పిటిషనరే అంగీకరిస్తున్నారని, అలాంటప్పుడు అక్రమమని చెప్పడానికి అవకాశంలేదని తెలిపారు. పిటిషనర్‌ దురుద్దేశంతో హైకోర్టుకు వచ్చారని, తమ భూములకు, భూదాన్‌ భూములకు సంబంధం లేదని పేర్కొన్నారు. పిటిషనర్‌ చేసిన విజ్ఞప్తుల పరిధికి మించి సింగిల్‌ జడ్జి ఆదేశాలు జారీ చేశారని, నిషేధిత జాబితాలో పెట్టాలని పిటిషనర్‌ కోరలేదని తెలిపారు. ఈ రిట్‌ అప్పీళ్లు బుధవారం విచారణను రానున్నాయి.


ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 04:56 AM