ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fire Safety Tips: ఇన్వర్టర్‌ నిప్పురవ్వలతోనే ప్రమాదం

ABN, Publish Date - May 22 , 2025 | 05:10 AM

హైదరాబాద్ గుల్జార్ హౌజ్‌లో ఇన్వర్టర్‌లో షార్ట్‌సర్క్యూట్ వల్ల ఏర్పడిన నిప్పురవ్వలు చెక్క ఫ్రేమ్‌పై పడిన మంటలతో 17 మంది దట్టమైన పొగ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక శాఖపై జరిగిన దశల వారీ పరిశీలనలో ఈ ప్రమాదం వివరాలు వెలువడ్డాయి.

  • షార్ట్‌సర్క్యూట్‌తో అంటుకున్న నిప్పు

  • నగల దుకాణంలోని చెక్క ఫ్రేమ్‌పై పడి..

  • మంటలు.. నిపుణుల ప్రాథమిక నిర్ధారణ

  • ప్రమాదంపై నేడో రేపో సమగ్ర నివేదిక

  • ప్రమాదాన్ని గుర్తించాక గంటపాటు

  • నిప్పు ఆర్పేందుకు యత్నించిన బాధితులు

  • పరిస్థితి చేయిదాటడంతో ‘ఫైర్‌’కు ఫోన్‌

  • మీడియాతో ఇష్టాగోష్ఠిలో

  • అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): గుల్జార్‌ హౌజ్‌ ప్రాంతంలో ఒకే కుటుంబంలో 17 మందిని బలితీసుకున్న అగ్ని ప్రమాదానికి కారణం ఇన్వర్టర్‌లో వచ్చిన నిప్పు రవ్వలేనని అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి తెలిపారు. దట్టమైన పొగ, మంటల వేడి కారణంగానే గదిలో ఉన్న 17 మంది ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుని, మృతి చెందినట్లు నిపుణులు ప్రాథమికంగా గుర్తించారని చెప్పారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. నాగ్‌పూర్‌కు చెందిన అగ్నిమాపక ఫోరెన్సిక్‌ ఇంజనీర్‌ నీలేశ్‌ ఉకుండే, హైదరాబాద్‌కు చెందిన ఫైర్‌ ఇంజనీర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ మహిపాల్‌రెడ్డి ప్రమాదం జరిగిన కృష్ణా పెరల్స్‌ దుకాణం, ఇంటిని బుధవారం సందర్శించారు. ఇన్వర్టర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా వచ్చిన నిప్పు రవ్వలే ప్రమాదానికి కారణమని వారు తేల్చినట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఇన్వర్టర్‌లో నిప్పు రవ్వలు వచ్చాయని, అవి దుకాణంలోని చెక్క ఫ్రేమ్‌లో ఎల్‌ఈడీ బల్బుల వద్ద పడడంతో మంటలు అంటుకున్నాయని చెప్పారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న నగల దుకాణం నుంచి పొగలు రావడాన్ని ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పనిమనిషి గుర్తించాడన్నారు.


ఈ విషయాన్ని మొదటి అంతస్తులో ఉన్న యజమానికి చెప్పాడని, తర్వాత అందరూ కలిసి బకెట్లలో, నల్లా పైపు నుంచి నీటిని తీసుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయినా దుకాణంలో మంటలు ఎగసిపడ్డాయన్నారు. అప్పటి వరకు మొదటి అంతస్తులో ఉండి మంటల్ని అదుపు చేయడానికి సలహాలు, సూచనలు చేసిన ప్రహ్లాద్‌ మోదీ కుటుంబ సభ్యులు.. దట్టమైన పొగ కమ్ముకోవడంతో పాటు మంటలు చెలరేగడంతో గదిలోకి వెళ్లారని చెప్పారు. మంటల తీవ్రత పెరగడంతో సుమారు 6.16 గంటల సమయంలో స్థానికుడు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాడన్నారు. మొగల్‌పుర అగ్నిమాపక కేంద్రం నుంచి సిబ్బంది కేవలం మూడు నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారని.. అప్పటికే తీవ్రమైన మంట, దట్టమైన పొగ అలుముకోవడంతో గదిలో ఉన్న ప్రహ్లాద్‌ మోదీ కుటుంబ సభ్యులు ఊపిరాడక మృతి చెందారని పేర్కొన్నారు. మెట్ల మార్గంలో భవనంపైకి వెళ్లి ఉంటే వారు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేదని నిపుణులు చెబుతున్నారని ఉన్నతాధికారి అన్నారు. కానీ, గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవడం, కిటికీలు మూసి ఉండడంతో అప్పటికే వ్యాపించిన పొగ, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చెలరేగిన మంటల వేడికి 17 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. గదిలోకి మంటలు వ్యాపించలేదని, ఇంట్లో ఉన్న వస్తువులు, దుస్తులు అలాగే ఉన్నాయని తెలిపారు. మృతులు వేసుకున్న దుస్తులకు కూడా ఏమీ కాలేదని గుర్తుచేశారు. పొగ, వేడి తీవ్రత కారణంగానే వారు మృతి చెందినట్లు గుర్తించారని ఉన్నతాధికారి చెప్పారు.పెద్దమొత్తం వెచ్చించి ఇళ్లు కొంటున్నవారు కొద్ది మొత్తం ఖర్చు పెడితే అగ్నిప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేవలం రూ.800 నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తే.. అగ్నిప్రమాదాల్ని గుర్తించే పరికరాలు ఇళ్లలో అమర్చుకోవచ్చంటున్నారు.

Updated Date - May 22 , 2025 | 05:11 AM