ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Caste Census: కులాల వెనుకబాటుతనంపై ర్యాంకులు

ABN, Publish Date - Jul 03 , 2025 | 04:08 AM

గత ఏడా ది నిర్వహించిన కులగణనలో ఆయా కులాల వెనుకబాటుపై ర్యాంకులిచ్చినట్లు స్వతంత్ర నిపుణుల కమిటీ తెలిపింది.

  • కుల గణనపై స్వతంత్ర కమిటీ అధ్యయనం పూర్తి

  • వారంలో నివేదిక సిద్ధం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు అందజేయనున్న స్వతంత్ర నిపుణుల కమిటీ

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): గత ఏడా ది నిర్వహించిన కులగణనలో ఆయా కులాల వెనుకబాటుపై ర్యాంకులిచ్చినట్లు స్వతంత్ర నిపుణుల కమిటీ తెలిపింది. కుల గణనపై అధ్యయనానికి రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శనరెడ్డి చైర్మన్‌గా స్వతంత్ర నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్థి సంస్థలో కమిటీ సమావేశమైంది. తమ నివేదికలో రాష్ట్రంలోని 242 కులాల వెనుకబాటుతనంపై కంపోజిట్‌ బ్యాక్‌వర్డ్‌ నెస్‌ ఇండెక్స్‌ (సీబీఐ) సూచీని పొందుపరిచినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 300 పేజీలకు పైగా గల నివేదికలో 242 కులాల వారీగా వెనుకబాటుపై సీబీఐ స్కోర్‌, ర్యాంకులిచ్చినట్లు పేర్కొంది. మరో వారంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలను కలిసి నివేదిక సమర్పిస్తామని కమిటీ తెలిపింది.

ఈ సమావేశంలో కమిటీ వైస్‌ చైర్మన్‌ కంచ ఐలయ్య, కన్వీనర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి, సభ్యులు ప్రొఫెసర్‌ శాంత సిన్హా, డాక్టర్‌ సుఖ్‌దేవ్‌ థారోట్‌, డాక్టర్‌ హిమాన్షు, నిఖిల్‌ డే, ప్రొఫెసర్‌ భాంగ్య, పురుషోత్తమ్‌, రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తాని యా, కమిటీ కార్యదర్శి అనుదీప్‌ పాల్గొన్నారు. కాగా, గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని నిర్ణయించిన సర్కారు.. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీకి ప్రక్రియ పూర్తి చేసింది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఫిబ్రవరి 16న ప్రారంభించిన కుల గణన రీ సర్వేలో 4,652 కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకున్నాయి. ఓసీలు, ఓసీల్లోని ముస్లింల జనాభా కలిపి ఓసీలు: 47,21,115 (15.79ు) కాగా, ముస్లిం బీసీలతో కలిపి రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతం ఉన్నట్లు తేలింది.

జనాభా వారీగా కుల గణన సర్వే వివరాలు

మొత్తం కుటుంబాలు 1,12,15,134,

జనాభా 3,54,77,554

పురుషులు 1,79,21,183 (50.51%)

స్త్రీలు 1,75,42,579 (49.45%)

ధర్డ్‌జెండర్‌ 13,774 (0.04%)

కులాల వారీగా జనాభా వివరాలు

ఎస్సీలు 61,84,319 (17.43%),

ఎస్టీలు 37,05,929 (10.45%),

బీసీలు 1,64,09,179 (46.25 %)

ముస్లిం 44,57,012 (12.56 %),

బీసీ ముస్లింలు 35,76,588 (10.08%)

ఓసీ జాబితాలోని

ముస్లింలు 8,80,424 (2.48%)

ఓసీలు 38,30,691 (13.31%)

Updated Date - Jul 03 , 2025 | 04:08 AM