ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ICET Results: ఐసెట్‌లో 90.83% ఉత్తీర్ణత

ABN, Publish Date - Jul 08 , 2025 | 03:51 AM

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు వెలువడ్డాయి. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌

  • అమ్మాయిల్లో 90.95 శాతం, అబ్బాయిల్లో 90.7 శాతం

  • మొత్తం 58,985 మంది పాస్‌ వీరిలో 30,580 మంది బీకాం..

  • 13,389 మంది బీఎస్సీ, 3,812 మంది బీటెక్‌ పట్టభద్రులు

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు వెలువడ్డాయి. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌ ఆచార్య బాలకిష్ట్టారెడ్డి, వైస్‌ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్‌, ఐసెట్‌ కన్వీనర్‌ అలువాల రవి ఫలితాలను విడుదల చేశారు. జూన్‌ 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 64,938 మంది హాజరుకాగా 58,985(90.83ు) మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల్లో 90.7ు, అమ్మాయిల్లో 90.95ు ఉత్తీర్ణత నమోదైంది.

ఎప్‌సెట్‌లో 85,695 మంది ధ్రువీకరణపత్రాల పరిశీలన పూర్తి

ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. గత నెల 28 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌ ప్రారంభం కాగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన మంగళవారంతో ముగియనుంది. సోమవారం వరకు 97,533 మంది ధ్రువపత్రాల పరిశీలన కోసం దరఖాస్తు చేసుకోగా 85,695 మంది పరిశీలన పూర్తయింది.

Updated Date - Jul 08 , 2025 | 03:51 AM