Traffic Restrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు: ఈ రూట్‌లో వెళ్లొద్దు..
ABN, Publish Date - Jan 25 , 2025 | 08:06 PM
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీని వల్ల ప్రయాణికులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సిక్రిందాబాద్ పరేడ్ గ్రాండ్ పరిసరాల్లో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా హైదరాబాద్‌లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిక్రిందాబాద్ పరేడ్ గ్రాండ్‌లో రిపబ్లిక్ డే వేడుకులు, రాజ్ భవన్ ఎట్ హోం దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7.30గంటల నుంచి 11.30 గంటల వరకు సిక్రిందాబాద్ పరేడ్ గ్రాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు రాజ్ భవన్ సమీపంలో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మార్గంలో వచ్చే వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సిక్రిందాబాద్ పరేడ్ గ్రాండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో టివోలీ ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మార్గాన్ని పోలీసులు మూసివేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రమాణికులు ముందుగా బయలుదేరి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని పోలీసులు విజ్జప్తి చేశారు.
Updated Date - Jan 25 , 2025 | 09:31 PM