TG Govt: సీఎం రేవంత్ చేతుల మీదగా.. కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధం
ABN, Publish Date - Jul 11 , 2025 | 06:22 PM
రాష్ట్రంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి.. లబ్ది దారులకు ఈ రేషన్ కార్డులు అందజేయనున్నారు. అందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
హైదరాబాద్, జులై 11: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా ముహూర్తం ఖారారు చేసింది. జులై 14వ తేదీన తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2. 4 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. తద్వారా 11. 30 లక్షల మంది పేదలు ప్రయోజనం చేకూరనుంది. గత ఆరు నెలల్లో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది. త్వరలో పంపిణీ చేయనున్న వాటితో కలిపి రేషన్ కార్డుల సంఖ్య దాదాపు 95 లక్షలకు చేరనుంది. మొత్తంగా 3.14 కోట్ల మందికి ఈ కార్డుల ద్వారా లబ్ధి చేకూరనుంది.
మరో వైపు కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వం గతంలో సూచించిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది తమతోపాటు తమ కటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో లబ్దిదారులను ప్రభుత్వం సర్వే చేసి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. అందుకు సంబంధించిన పనులను ప్రభుత్వం ఇప్పటికే వేగవంతం చేసింది.
Updated Date - Jul 11 , 2025 | 06:22 PM