Kaleshwaram Effects: కాళేశ్వరం కొట్టిన దెబ్బ.. ఆనాటి కథలు.. ఈటలపై తుమ్మల ఫైర్
ABN, Publish Date - Jun 07 , 2025 | 06:45 PM
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు వేసిన కాళేశ్వరం కమిషన్ ముందు వింత వింత సంగతులు బయటకొస్తున్నాయి. ఈ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చిన ఈటల మాటలపై తుమ్మల మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ నేత, హైదరాబాద్-మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలను తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుబట్టారు. కాళేశ్వరం కమిషన్‌కు ఈటల అసత్యాల వాంగ్మూలం ఇచ్చారని మంత్రి తుమ్మల ఆగ్రహించారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈటల పొంతనలేని సమాధానం ఇచ్చారని, ఆయన చెప్పిన సబ్ కమిటీ.. కాళేశ్వరం కోసం వేసింది కాదన్నారు. కాళేశ్వరానికి శాంక్షన్ ఇచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టుల కోసం వేసిన సబ్ కమిటీ అదని తుమ్మల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రాణహిత, దేవాదుల, కాంతలపల్లి, తుపాకులగూడెం పనుల కోసం సబ్ కమిటీ వేశారని బీఆర్ఎస్ పాలనా సమయంలో జరిగిన విషయాల్ని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. ఆ సబ్ కమిటీ కాళేశ్వరం బ్యారేజీలపై ఎలాంటి నివేదిక ఇవ్వలేదని.. కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ ఆమోదం తెలిపిందనడం అబద్ధమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం పొందలేదని మంత్రి తుమ్మల తేల్చిచెప్పారు.
'కాళేశ్వరం ఎప్పుడూ కేబినెట్ ముందుకు రాలేదు. పరిపాలన అనుమతులతోనే కాళేశ్వరం అమలులోకి వచ్చింది. ఈటెల రాజేందర్ ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కమిషన్ ముందు ఈటలకు అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. ఈటల పట్ల గౌరవం ఉంది, కానీ ఆయన ప్రకటన చూసిన తర్వాత కొంత బాధేసింది. నేను స్వయంగా కమిషన్‌కు సబ్ కమిటీ రిపోర్ట్‌ను ఇవ్వాలని అనుకుంటున్నా. కమిషన్ వివాదంలోకి నన్ను ఎందుకు లాగాల్సి వచ్చిందో ఈటలే సమాధానం చెప్పాలి. తుమ్మల కూడా కాళేశ్వరం కోసం సబ్ కమిటీ రిపోర్ట్ పై సంతకం చేశారని ఇచ్చిన వాగ్మూలం బాధాకరం. కాళేశ్వరం అంశం కేబినెట్ ఉమ్మడి నిర్ణయమని చెప్పడం సరికాదు. హరీష్ రావు అబద్దాల హరీష్ రావుగా మారిపోయారని' మంత్రి తుమ్మల అన్నారు.
కాళేశ్వరం కేబినెట్ ముందుకు వచ్చినట్లు రుజువు చూపించాలని ఈటలను తుమ్మల డిమాండ్ చేశారు. కాగా, తుమ్మల గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే వారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి చేరి ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..
Updated Date - Jun 07 , 2025 | 08:38 PM