Ghatkesar Case: అత్తను బలి తీసుకున్న అల్లుడు
ABN, Publish Date - Jun 11 , 2025 | 11:00 AM
Ghatkesar Case: ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. అత్త అనే కనికరం లేకుండా అల్లుడు కిరాతకంగా చంపేశాడు.
హైదరాబాద్, జూన్ 11: ఈ మధ్య కాలంలో హత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలతోనే కొందరు దారుణాలకు తెగబడుతున్నారు. బంధాలను కూడా పక్కన పెట్టేసి క్షణికావేశాల్లో ఇతరుల ప్రాణాలను తీసేస్తున్నారు. కొందరి హత్యలు ఎందుకు జరిగాయో కారణాలు తెలుసుకుని పోలీసులే షాక్ తిన్న ఘటనలు ఉన్నాయి. 50 రూపాయల కోసం కూడా విచాక్షణారహితంగా దాడి చేసి మనుషులను చంపిన దారుణాలు ఉన్నాయి. మద్యానికి డబ్బులు ఇవ్వలేదనో లేక అనుమానాలతో, వివాహేతర సంబంధాల కారణంగా అనేక మంది ఇతరుల చేతుల్లో అతి దారుణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అత్తను అల్లుడు చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఘట్‌కేసర్‌లో ఈ దారుణం జరిగింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
మొబైల్ కారణంగా నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు అల్లుడు. ఘట్‌కేసర్‌లో బుజ్జి అనే మహిళ నివాసముంటోంది. బుజ్జికి బాబురావు అనే అల్లుడు ఉన్నాడు. ఈ క్రమంలో అత్త వద్ద ఉన్న మొబైల్‌ను బాబు రావు తీసుకున్నాడు. డబ్బుల కోసమో మరే ఇతర కారణమో తెలియదు కానీ అత్త మొబైల్‌ను బాబు రావు అమ్మేశాడు. ఆ తరువాత మొబైల్ ఇవ్వాలని కోరగా.. అమ్మేసినట్లు చెప్పాడు బాబురావు. దీంతో మొబైల్ అమ్మడంపై అల్లుడిని నిలదీసింది అత్త బుజ్జి. మొబైల్‌ను అమ్మాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించింది.
ఈ విషయంపై అల్లుడు బాబురావు, అత్త బుజ్జి మధ్య గొడవ తలెత్తింది. ఈ విషయాన్ని బాబురావు సీరియస్‌గా తీసుకున్నాడు. మొబైల్ ఫోన్ కోసం అవమానించారంటూ కోపంతో రగిలిపోయాడు. క్షణికావేశంలో అత్త బుజ్జి గొంతు నులిమాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన బుజ్జు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బుజ్జి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ కోసం అత్తను చంపేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం కమిషన్ విచారణకు బయల్దేరిన కేసీఆర్
నాన్న స్ఫూర్తితో పతకాల వేట
Read latest Telangana News And Telugu News
Updated Date - Jun 11 , 2025 | 11:11 AM