Manchu Family: మేజిస్ట్రేట్ ముందు తిట్టుకొన్న మోహన్ బాబు, మనోజ్
ABN, Publish Date - Feb 03 , 2025 | 06:54 PM
Manchu Family: ఇటీవల మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు చెలరేగాయి. ఆ క్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీమ సింగ్ ఎదుట మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ హాజరయ్యారు. దీంతో జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట వారిద్దరు వాగ్వివాదానికి దిగారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 03: మెజిస్ట్రేట్ ఎదుట మంచు మనోజ్, మంచు మోహన్ బాబు పరస్పరం దూషణలకు దిగారు. మంచు మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని జిల్లా కలెక్టర్ విచారణకు పిలిచారు. ఆ క్రమంలో సోమవారం అంటే.. ఫిబ్రవరి 03వ తేదీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు వీరిద్దరు హాజరయ్యారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ వారిద్దరిని రెండు గంటల పాటు విచారించారు. అయితే వచ్చే వారం మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని వారిద్దరిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
మరోవైపు తల్లిదండ్రులు, వృద్ధులు సంరక్షణ చట్టం కింద తనకు భద్రత కల్పించాలంటూ జిల్లా కలెక్టర్‌ను కోరారు. అలాగే తన ఆస్తులను సైతం కాపాలని విజ్జప్తి చేశారు. ఈ ఆస్తి అంతా తాను కష్ట పడి సంపాదించిందని జిల్లా కలెక్టర్‌కు మోహన్ బాబు వివరించారు. అలాంటి ఈ ఆస్తిలో ఎవరి హక్కు లేదని ఆయన పేర్కొ్న్నట్లు తెలుస్తోంది. అయితే తనకు సంబంధించిన ఆస్తిలో మంచు మనోజ్ ఉన్నారని.. అతడిని అందులోనుంచి ఖాళీ చేయించాలని కోరారు.
Also Read: హెల్మెట్‌కి సెల్యూట్.. ప్రాణాలు కాపాడడం అదుర్స్
అలాగే ఆ ఆస్తిని సైతం తనకు అప్పగించాలన్నారు. ఆ క్రమంలో మంచు మనోజ్‌కు, మోహన్ బాబుకు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంత అర్థాంతరంగా అక్కడి నుంచి మంచు మనోజ్ వెళ్లిపోయారు. దీంతో మరోసారి విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. దాంతో వచ్చే వారం మరోసారి హాజరు కావాలంటూ జిల్లా కలెక్టర్.. మోహన్ బాబు, మంచు మనోజ్‌ను ఆదేశించారు.
Also Read: ఏపీకి మరో గుడ్ న్యూస్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఈ విచారణలో వారు చేసిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ పలు ప్రశ్నలు సంధించారు. అయితే తమ వద్ద ఉన్న పలు ఆస్తి సంబంధించిన డాక్యుమెంట్లను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు మోహన్ బాబు, మంచు మనోజ్ వేర్వేరుగా అందజేశారు.
Also Read: ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇటీవల మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు చెలరేగాయి. దీంతో మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య దూరం పెరిగింది. ఆ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని.. తనకు, తన భార్య మౌనికకు ప్రాణ హాని ఉందంటూ మంచు మనోజ్.. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Also Read: అక్కడ మతం మారారా.. జైలు శిక్షతోపాటు భారీ జరిమానా
ఇది జరిగిన కొద్ది నిమిషాలకే అతడి తండ్రి మోహన్ బాబు.. రాచకొండ పోలీస్ కమిషనర్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మంచు మనోజ్, అతడి భార్య మౌనిక ద్వారా తనకు ప్రాణ హాని ఉందంటూ ఆ ఫిర్యాదులో స్పష్టం చేశారు. దీంతో ఇరు వర్గాల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేపట్టారు.
For Telangana News And Telugu News
Updated Date - Feb 03 , 2025 | 06:58 PM