ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Phone Tapping Case: గంటన్నరగా విచారణ.. ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం

ABN, Publish Date - Jun 09 , 2025 | 01:20 PM

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో గంటన్నరగా ప్రభాకర్‌ రావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎస్‌ఐబీ చీఫ్‌ను పలు ప్రశ్నలు సంధించారు పోలీసులు.

Phone Tapping Case

హైదరాబాద్, జూన్ 9: తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును (Former SIB Chief Prabhakar Rao) పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. దాదాపు గంటన్నరగా ప్రభాకర్ రావును దర్యాప్తు బృందం విచారణ చేసి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తోంది. విచారణ ప్రక్రియను మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌ విచారణ జరుగుతోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు స్పందిస్తున్నారా, ఏ మేరకు సమాధానాలు ఇచ్చారో తెలియాల్సి ఉంది.

ఇప్పటి వరకు సంధించిన ప్రశ్నలివే

1. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు చెప్పాలనుకుంటున్నారు ?

2. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన వెంటనే మీరు విదేశాలకు ఎందుకు వెళ్లిపోయారు ?

3. కేసు నమోదు అయిందనే సమాచారంతోనే విదేశాలకు పారీపోయారా ?

4. మీరు రాజీనామా చేసిన రోజు హార్డ్ డిస్క్‌లను ధ్వసం చేశారు?

5. ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు చెప్పాడు ? మా దగ్గర స్టేట్‌మెంట్ ఉంది మీరేమంటారు ?

6. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీమ్‌ను ఎవరు చెపితే ఏర్పాటు చేశారు ?

7. ఈ టీమ్ ఏర్పాటు గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఏర్పాటు చేశారా ?

8. నాలుగు వేలకు పైగా ఫోన్‌లు ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.. ఈ నెంబర్లు ఎవరు ఇచ్చారు ?

9. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసులు అధికారులందరూ మీ పేరే చెప్తున్నారు ?

10. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారు.. ఇందులో కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది కదా ?

11. సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే హార్డ్ డిస్క్‌లను , ఇతర ఆధారాలను ధ్వంసం చేయాలని ముందే ప్లాన్ చేశారా ?

12. ప్లాన్ ప్రకారమే ఎన్నికల ఫలితాల రోజు రిజైన్ చేసి , ఆధారాలను మాయం చేశారా ?

13. శ్రవణ్ రావు ప్రైవేటు వ్యక్తి.. అతనితో ఎస్‌ఐబీకి ఏంటి సంబంధం ?

14. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌లను కూడా ఎందుకు ట్యాప్ చేశారు. మీకు ఎవరైనా పెద్దలు ఆదేశాలు ఇచ్చారా ?

15. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో కేవలం విపక్ష పార్టీల నాయకులు ఫోన్లు ట్యాప్ చేసే టాస్క్ ఫోర్స్ పోలీసులతో డబ్బులు సీజ్ చేశారా?

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం విచారణ.. దైవసాక్షిగా ప్రమాణం చేసిన హరీష్

పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 01:56 PM