ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ABN, Publish Date - May 22 , 2025 | 10:02 AM

PM Modi: తెలంగాణాలో మూడు రైల్వే స్టేషన్లను ప్రదాని మోదీ ప్రారంభించనున్నారు. వర్చువల్ విధానంలో ఈ రైల్వే స్టేషన్లను ఆయన ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేటతోపాటు వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. అందుకోసం రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్, మే 22: తెలంగాణలో ఆధునీకరించిన మూడు రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అందుకోసం రైల్వే శాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణను రైల్వే శాఖ చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లోని బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పూర్తయింది.

తొలివిడతలో భాగంగా ఈ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ పున: ప్రారంభించనున్నారు. హైటెక్ హంగులతోపాటు అత్యాధునిక సౌకర్యాలతో ఈ మూడు రైల్వే స్టేషన్ల సుందరీకరణ పూర్తయింది. బేగంపేట రైల్వే స్టేషన్ రూ. 27 కోట్ల బడ్జెట్‌తో ఆధునీకరణ పనులు చేపట్టారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. అలాగే వరంగల్‌ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎంపీ కడియం కావ్య, ఇతర ప్రజా ప్రతినిధులతోపాటు రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.


కేంద్రం అమలు చేస్తున్న అమృత్‌ భారత్‌ స్కీమ్‌‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. అందులోభాగంగా దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను ఈ మోదీ సర్కార్ అభివృద్ధి చేస్తోంది. మొదటి విడతలో 103 రైల్వే స్టేషన్లు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఆ జాబితాలో బేగంపేట్‌, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లతో పాటు ఏపీలోని సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ను సైతం ప్రధాని మోదీ ఈ రోజు వర్చువల్‌గా ప్రారంభించున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్రం రూ. లక్ష కోట్లు బడ్జెట్‌తో దేశంలోని 1300కుపైగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనుంది.ఈ అభివృద్ధి పనులను 2023,ఆగస్టులో ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో రూ. 2,750 కోట్లతో 40 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ప్రకటన

YCP Leader: టీడీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు.. వైసీపీ నేతపై కేసు నమోదు

For Telangana News And Telugu News

Updated Date - May 22 , 2025 | 11:15 AM