ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన బల్మూరి వెంకట్

ABN, Publish Date - Jun 25 , 2025 | 05:57 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. బల్మూరి వెంకట్ స్టేట్‌మెంట్‌ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా సిట్ అధికారులు తనను విచారణకు పిలిచారని తెలిపారు.

MLC Balmuri Venkat

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat) ఇవాళ(బుధవారం) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. బల్మూరి వెంకట్ స్టేట్‌మెంట్‌ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా సిట్ అధికారులు తనను విచారణకు పిలిచారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం కోసం నీచానికి దిగిందని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా వినడం దారుణమని ఫైర్ అయ్యారు. ఫోన్లు ట్యాపింగ్ చేసి సంభాషణలు విని తమను ఇబ్బందులకు గురి చేశారని ధ్వజమెత్తారు. వాళ్లకు కుటుంబాలు లేవా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడ్డ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరించారు.

నా భార్య ఫోన్ ట్యాప్ చేశారు: ఫయిమ్ ఖురేషి

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు TMREIS వైస్‌ చైర్మన్ ఫయిమ్ ఖురేషి ఇవాళ(బుధవారం) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. ఫయిమ్ ఖురేషి స్టేట్‌మెంట్‌ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా ఫయిమ్ ఖురేషి మీడియాతో మాట్లాడారు. తన ఫోన్ ట్యాప్ అయిందని మూడు రోజుల క్రితం డీసీపీ నుంచి సమాచారం అందిందని తెలిపారు. తన ఫోన్‌తో పాటు, తన భార్య డ్రైవర్ ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. ఇప్పటికే తమ డ్రైవర్ సిట్ ముందు హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారని వెల్లడించారు. రాజకీయంలో ఉన్న తన ఫోన్ కాకుండా తన భార్య ఫోన్ కూడా ఎందుకు టాప్ చేశారని ప్రశ్నించారు. భార్యాభర్తల మధ్య వ్యక్తిగత సంభాషణలు కూడా విన్నారని మండిపడ్డారు. అధికారం కోసం ఇంత నీచానికి దిగజారుతారా అని ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు తన ఫోన్ ట్యాప్ చేసి తనపై చాలా ఒత్తిడి తెచ్చారని అన్నారు. తన సిద్ధాంతం కాంగ్రెస్ సిద్ధాంతమని.. తాను నమ్ముకున్నది రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని అని ఫయిమ్ ఖురేషి పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల

ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 25 , 2025 | 06:02 PM