Malnadu Kitchen Drugs Case: మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసు.. విచారణలో విస్తుపోయే నిజాలు
ABN, Publish Date - Jul 10 , 2025 | 02:37 PM
Malnadu Kitchen Drugs Case: గోవాలో నైజీరియన్ దేశస్థుడు నిక్ నుంచి కొకైన్, ఎమ్‌డీఎమ్‌ఏను కొనుగోలు చేశారని.. డ్రగ్స్ కోసం హాస్పిటల్ ట్రీట్మెంట్ పేరుతో 1.8 లక్షలు నగదు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. శ్రీ మారుతి కొరియర్ పేరుతో డ్రగ్స్ ప్యాకెట్లు సరఫరా అయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, జులై 10: మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో (Malnadu Kitchen Drugs Case) మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొరియర్ల ద్వారా డ్రగ్స్‌ను మల్నాడు కిచెన్‌కు వచ్చినట్లు ఈగల్ టీమ్ విచారణలో బయటపడింది. మల్నాడు కిచెన్ యజమాని సూర్య అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించారు. మల్నాడు కిచెన్ నుంచి డ్రగ్స్‌ను ఆర్డర్ల వారీగా సప్లై చేసినట్లు ఆధారాలు సేకరించింది టీమ్. రెస్టారెంట్‌తో పాటు హైదరాబాద్‌లో 20 పబ్బులకు ఇప్పటి వరకు డ్రగ్స్ సప్లై అయినట్లు ఈగల్ టీం విచారణలో వెల్లడైంది. అలాగే ప్రముఖులకు కూడా డ్రగ్స్‌ను డోర్ డెలివరీ చేసినట్లు గుర్తించారు.
గోవాలో నైజీరియన్ దేశస్థుడు నిక్ నుంచి కొకైన్, ఎమ్‌డీఎమ్‌ఏను కొనుగోలు చేశారని.. డ్రగ్స్ కోసం హాస్పిటల్ ట్రీట్మెంట్ పేరుతో 1.8 లక్షలు నగదు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించారు. శ్రీ మారుతి కొరియర్ పేరుతో డ్రగ్స్ ప్యాకెట్లు సరఫరా అయినట్లు తెలుస్తోంది. గర్ల్స్ చెప్పుల హీల్ నుంచి కొకైన్, ఎక్స్‌టసీ పిల్స్, ఓజీ కుష్ ఆయిల్‌ను ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌లో 15 మంది డాక్టర్లకు కొరియర్ల ద్వారా డ్రగ్స్‌ను సూర్య అందజేసినట్లు ఈగల్ టీమ్ విచారణలో తేలింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో బయటపడింది. మూడు పబ్‌ల యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ క్రమంలో పబ్ యజమానులకు ఈగల్ టీమ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే వారం తమ ఎదుట హాజరుకావాలని పబ్బు యజమానులకు నోటీసులు ఇవ్వనుంది.
పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాటు చేశాయి. ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్ , బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్ పార్టీలు జరిగినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ క్రమంలో వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే పబ్ యజమానులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. క్వాక్ పబ్ ఓనర్ రాజా శేఖర, కోరా పబ్ యజమాని పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టిపై కేసు నమోదు అయ్యింది. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు విచారణలో సూర్య పేర్కొన్నారు. దీంతో వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి
హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ వివాదం.. వెలుగులోకి కీలక విషయాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఢిల్లీకి సిట్ అధికారులు.. ఎందుకంటే
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 10 , 2025 | 02:41 PM