ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hydra: కంటోన్మెంట్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు..

ABN, Publish Date - Jun 06 , 2025 | 08:42 AM

Hydra: హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. రెండు రోజులుగా కూల్చివేతల కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్ నగరంలోని గురువారం అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువులో ఆక్రమణలను కూల్చివేసింది. శుక్రవారం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ పరిధిలో ప్యాట్ని నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది.

Hydra demolition drive

Hyderabad: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ (Secunderabad Cantonment) పరిధిలో హైడ్రా కూల్చివేతలు (Hydra demolition) కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్యాట్ని నాలా (Patny Nala) వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కంటోన్మెంట్ పరిధిలో తొలిసారి హైడ్రా కూల్చివేతలు చేస్తోంది. గురువారం కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. పలు నిర్మాణాలతో ప్యాట్ని నాళా కుచించుకుపోయినట్లు గుర్తించారు. ఈ కారణంగా భారీ వర్షాలు కురిస్తే.. కంటోన్మెంట్ ముంపు భారిన పడుతుందని భావించి ఈ మేరకు కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ అధికారుల సహకారంతో ప్యాట్ని నాళా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.


అల్వాల్‌లో హైడ్రా కూల్చివేతలు..

కాగా గురువారం అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువులో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఉదయాన్నే బుల్డోజర్లు, ఎక్స్‌కావేటర్లతో చిన్నరాయుని చెరువు వద్దకు చేరిన హైడ్రా సిబ్బంది చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు. ఈ క్రమంలో నిర్మాణదారులకు, హ్రైడా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మోహరించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భవన నిర్మాణాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు చేపట్టారు.

కాగా నిజాం కాలంలో 20 ఎకరాల పైచిలుకు విస్తరించిన అల్వాల్‌ చెరువు.. ఇప్పుడు 9 ఎకరాలకు పరిమితమైపోయింది. మానవ నిర్మితమైన ఈ చెరువు.. ఒకప్పుడు పశువులు, పక్షులకు ఆవాసంగా.. తాగునీటి అవసరాలు తీర్చే కల్పతరువుగా ఉండేది. ఇప్పుడు తన ప్రభావాన్ని క్రమంగా కోల్పోతూ వస్తోంది. గృహ సంబంధ వ్యర్థాలు, కాలుష్యకారకాలు పెరిగి.. చెరువు మొత్తం మురికికూపంగా మారిపోయింది. ఆక్రమణలతో కుచించుకుపోయింది.


హైడ్రా హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను తొలగించడం, చెరువులను రక్షించడం, నగరాన్ని వరదల నుంచి కాపాడడం వంటి పనులు చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఇప్పటికే వందల సంఖ్యలో కట్టడాలను కూల్చివేసింది. మరోవైపు హైడ్రా రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయ్యింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒకే తేదీల్లో తెలంగాణ టెట్.. ఏపీ డీఎస్సీ.. ఇరకాటంలో అభ్యర్థులు...

జగన్ సాధించిన అతిపెద్ద ఘనత ఏంటంటే..

For More AP News and Telugu News

Updated Date - Jun 06 , 2025 | 08:42 AM