ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hydra: శంషాబాద్ సమీపంలో ప్రహరీ గోడలు కూల్చివేసిన హైడ్రా

ABN, Publish Date - Feb 05 , 2025 | 01:02 PM

నిర్మాణరంగ, ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. తాజాగా హైడ్రా అధికారులు శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన ప్రహరీ గోడలు కూల్చివేశారు.

Hydera

హైదరాబాద్: కొద్ది రోజులుగా దూకుడు తగ్గించిన హైద్రా (Hydra) మళ్లీ రంగంలోకి దిగింది. బుధవారం శంషాబాద్ (Shamshabad) వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) సర్వీస్ రోడ్డు పక్కన ప్రహరీ గోడలను (Wall) హైడ్రా అధికారులు కూల్చివేశారు (Demolished). సర్వే నంబర్లు 601, 602 లో చేపట్టిన ప్రహరీ గోడను తెల్లవారుజామున కూల్చివేశారు. వివాదాస్పద రోడ్డు స్థలం విషయంలో ఫిర్యాదులు రావడంతో కూల్చివేశారు. అయితే తమ పట్టా భూమిలో తాము నిర్మించుకున్న ప్రహరీ గోడను హైడ్రా అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసారని బాధితులు మండిపడుతున్నారు. హైడ్రా అధికారుల తీరుపై న్యాయపోరాటం చేస్తామని బాధితులు ప్రకటించారు.

ఈ వార్త కూడా చదవండి..

బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు..


చెరువుల్లో వ్యర్థాలు డంప్‌ చేస్తోన్న టిప్పర్లు సీజ్..

కాగా నిర్మాణరంగ, ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి అక్రమంగా వ్యర్థాలు డంప్‌ చేస్తోన్న నాలుగు టిప్పర్లను హైడ్రా డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌) బృందాలు పట్టుకున్నాయి. ఉందాసాగర్‌ (Undasagar)లో వ్యర్థాలు పోస్తున్న నాలుగు టిప్పర్లు, పోసిన మట్టిని వెంటనే చదును చేస్తోన్న ప్రొక్లెయినర్‌నూ పట్టుకున్నారు.


అనంతరం బండ్లగూడ పోలీస్ స్టేషన్‌(Bandlaguda Police Station)లో వాహనాలు, డ్రైవర్‌ క్లీనర్‌ను అప్పగించి వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. పేట్‌బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని దేవులపల్లి (సమర్‌కుంట) చెరువులో మట్టి పోస్తోన్న మరో లారీని పట్టుకున్నారు. వాహనం, డ్రైవర్‌, క్లీనర్‌ను పోలీసులకు అప్పగించారు. వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో మట్టి, ఇతర వ్యర్థాలు పోస్తే కేసులు నమోదు చేస్తామని, అన్ని ప్రాంతాల్లో హైడ్రా బృందాల నిఘా ఉందని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే..

మహాకుంభమేళాకు ప్రధాని మోదీ ..

రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 01:02 PM