Gold Prices.. బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు..
ABN , Publish Date - Feb 05 , 2025 | 12:41 PM
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధర, నగలు కొనుగోలు చేసే వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది.
ABN Internet: దేశంలో బంగారం ధరలు (Gold Rate) రోజురోజుకు పెరుగుతున్నాయి. (Increases) కొండెక్కుతున్న ధరలతో ఊహకు అందనంత వేగంగా సరికొత్త రికార్డులకు చేరుకుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు.. పెళ్లిళ్ల సీజన్ (Wedding Season) మొదలు కావడంతో బంగారం ధర శర వేగంతో దూసుకుపోతోంది. బుధవారం ఉదయం ఆల్‌టైమ్ రికార్డు ధరకు (All Time Record Price) బంగారం చేరుకుంది. నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారట్ల బంగారంపై రూ. 1,040 పెరగగా, 22 క్యారట్ల బంగారంపై రూ. 950 పెరిగింది. దీంతో దేశంలో 24 క్యారట్ల బంగారం ధర రూ. 87 వేలకు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ.79,050గా నమోదైంది. ఇక కేజీ వెండి ధర రూ. 97,302గా ఉంది.
ఈ వార్త కూడా చదవండి..
కొనుగోలు దారుల ఆందోళన..
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధర, నగలు కొనుగోలు చేసే వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. అంతేకాదు బంగారం ధర బడ్జెట్ అనంతరం మరింత భారీగా పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర చరిత్రలో మొదటిసారిగా రూ. 87 వేల మార్కుకు చేరుకుంది. ధరల పెరుగుదల ఇలానే కంటిన్యూ అయితే.. అతి త్వరలోనే లక్ష రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు .
ప్రధానంగా బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనం అవుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ తోడుకావడంతో బంగారం విక్రయాలు పెరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాములు 24 క్యారట్ల బంగారం ధర రూ.87 వేలు ఉండగా.. 22 క్యారట్ల బంగారం రూ.79,050గా నమోదైంది. వెండి ధర నాలుగు రోజుల తరువాత పెరిగింది. ఇవాళ కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగి రూ. 97,302 వద్ద కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే..
రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News