ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

72nd Miss World pageant: మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు..

ABN, Publish Date - May 05 , 2025 | 08:51 AM

మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన అందాల బామలు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. సోమవారం నుంచి విదేశీ ప్రతినిధుల రాక పెరుగనుంది. ఇందుకోసం ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.

72nd Miss World pageant

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్ (Hyderabad) వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు (72nd Miss World Pageant) జరుగనున్నాయి. ఇవి మే 7వ తేదీన (May 7th) ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ (Jun 2nd) తేదీతో ముగియనున్నాయి. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల (120 Countries) నుంచి అందాల భామలు పాల్గొనున్నారు. ఈ క్రమంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది. వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad airport welcome)ను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.


సోమవారం నుంచి పెరుగనున్న విదేశీ ప్రతినిధుల రాక

సోమవారం నుంచి విదేశీ ప్రతినిధుల రాక పెరుగనుంది. ఇందుకోసం ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తెలంగాణ జరూర్ ఆనా నినాదాలు కనిపించేలా, వినిపించేలా పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌కు చేరుకుంటున్న అందాల భామలు..

మిస్‌వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన అందాల బామలు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్న సుందరీమణులకు టూరిజంశాఖ అధికారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతున్నారు. ఆదివారం మిస్‌ బ్రెజిల్‌ జెస్సీకా స్కాండుజ్‌ పెద్రోసో, మిస్‌ సౌత్‌ఆఫ్రికా జోయాలిజే జాన్సన్‌వాన్‌ రెన్స్‌బర్గ్‌తోపాటు 90 మంది పోటీదారులు హైదరాబాద్‌ చేరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం మరికొందరు పోటీదారులు వచ్చే అవకాశం ఉంది. అందగత్తెలు ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది. అనంతరం వారిని ఆయా హోటళ్లకు తరలించారు. కాగా, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అతిథులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ను టూరిజం శాఖ అందుబాటులోకి తెచ్చింది.

Also Read: తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త


ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

అయితే ఒకే ఒక్క దేశం నుంచి అందాల భామలు పాల్గొరనే ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. ఆ ఒక్క దేశమే పాకిస్థాన్. ఎందుకంటే.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే దేశంలోని పాకిస్థానీలు భారత్ విడిచి వెళ్లేందుకు ఏప్రిల్ 29వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. ఆ క్రమంలో దాదాపుగా పాకిస్థానీలు.. దేశం విడిచి వెళ్లినట్లు ప్రభుత్వం సైతం వెల్లడిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు పాకిస్థానీ అందాల భామలు ఈ పోటీలో పాల్గొరని సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు..

విషం చిమ్ముదాం

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 10:07 AM