Share News

Red Alert: రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు..

ABN , Publish Date - May 05 , 2025 | 07:11 AM

రాష్ట్రంలో మరో రెండు రోజులు భిన్న వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మరికొన్ని చోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Red Alert: రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు..
Heavy Rains

అమరావతి: అకాల వర్షాలు (Heavy Rains) ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ను వణికిస్తున్నాయి. కుండపోత వానలతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ (Red Alert Issued) చేసింది. కొన్ని జిల్లాల్లో వర్షం పడే అవకాశముందని ప్రకటించింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని.. అలాగే గంటకు 85 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. నిన్నటి వరకు మండుటెండలతో అల్లాడిన ప్రజలు వాతావరణంలో వచ్చిన మార్పులతో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు ప్రకటించడంతో జనాలు సేద తీర్చుకున్నారు. కానీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది.


మరో 2 రోజులు ఇదే పరిస్థితి

రాష్ట్రంలో మరో రెండు రోజులు భిన్న వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మరికొన్ని చోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అనకాపల్లి, ఉభయగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదివారం నంద్యాల జిల్లా గోనవరంలో 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Also Read: విషం చిమ్ముదాం


మంత్రుల సమీక్ష

అకాల వర్షాలపై హోం మంత్రి అనిత విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో మాట్లాడి, ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయించారు. పంట నష్టం జరగకుండా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

కాగా ఆదివారం ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. ఈదురు గాలులు కూడా తోడు కావడంతో భారీ హోర్డింగ్‌లు పడిపోయాయి. పెద్ద పెద్ద వృక్షాలు సయితం నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలతోపాటు ప్రధాన రహదారులపై మోకాలు లోతు నీరు చేరి జనజీవనం స్తంభించింది. ఆదివారం ఆహ్లాదంగా గడుపుతామనుకున్న ప్రజలను గుమ్మందాటి అడుగు బయటపెట్టనీయకుండా వరుణుడు, వాయువు ఒకటై బంధించేశారు. మధ్యాహ్నం తర్వాత కొన్ని చోట్ల వర్షం కాస్త తెరుపు ఇవ్వగా మరికొన్ని చోట్ల మాత్రం రాత్రి వరకు పడుతూనే ఉంది. కృష్ణా జిల్లా, విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులత కూడిన భారీ వర్షం కురిసింది.


వేలాది ఎకరాల్లో పంట నష్టం..

ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గాలివాన హోరెత్తించింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయా ప్రాంతాల్లో గంటల కొద్దీ వాన దంచికొట్టింది. పిడుగులు పడి ఆరుగురు, చెట్టు కూలి ఓ బాలుడు, విద్యుదాఘాతంతో మరొకరు మరణించారు. పెనుగాలులు, భారీ వర్షానికి వేలాది ఎకరాల్లో మామిడి, వరి, బొప్పాయి, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మామిడి, వరి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు చాలా చోట్ల భారీ వృక్షాలు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు భారీగా రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. కాకినాడ, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వాన దంచి కొట్టింది.

కాకినాడలో 105 మిల్లీమీటర్ల వర్షపాతం..

కాకినాడ జిల్లా కాజులూరులో అత్యధికంగా 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 130 చోట్ల 20 మిల్లీమీటర్ల కన్నా అధికంగా వాన పడింది. గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి, అరటి, కొబ్బరి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది. ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల్లో మామిడి పంటకు అపార నష్టం వాటిల్లింది. ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హోర్డింగ్‌లు పడిపోయాయి. విజయవాడ సహా పలు నగరాల్లో పల్లపు ప్రాంతాలు జలమయయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

టెల్‌అవీవ్‌ విమానాశ్రయ సమీపంలో క్షిపణి దాడి

ఆయువు తీసిన అనుమానం

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 07:11 AM