Hyderabad: ఆయువు తీసిన అనుమానం
ABN , Publish Date - May 05 , 2025 | 04:58 AM
భర్త అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండడంతో మనస్తాపం చెందిన భార్య ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ సుభాష్‌నగర్‌లోని ఓ అపార్టుమెంటులో ఆదివారం జరిగింది.
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
జీడిమెట్ల, మే 4 (ఆంధ్రజ్యోతి): భర్త అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండడంతో మనస్తాపం చెందిన భార్య ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ సుభాష్‌నగర్‌లోని ఓ అపార్టుమెంటులో ఆదివారం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన లక్ష్మి అలియాస్ పూజ (25)కు అదే జిల్లా సోంపేటకు చెందిన హరికృష్ణతో గత సంవత్సరం డిసెంబర్ 14న వివాహం జరిగింది. జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ కంపెనీలో హరికృష్ణ పనిచేస్తున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న లక్ష్మి తన మేన బావను ప్రేమించింది. అయితే రెండు కుటుంబాల మధ్య వైరం ఉండటంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు.
ఆమె తల్లిదండ్రులు అకౌంటెంట్‌గా పనిచేస్తున్న హరికృష్ణతో వివాహం జరిపించారు. లక్ష్మి తన బావను ప్రేమించిన విషయం హరికృష్ణకు తెలియడంతో పెళ్లి అయినప్పటి నుంచి అనుమానంతో ఆమెను వేధింపులకు గురిచేస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో లక్ష్మి ఐదంతస్తుల భవనంపై నుంచి కిందపడి మృతి చెందింది. లక్ష్మి మృతికి సంబంధించి ఆమె భర్త పాత్రపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..
AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..