ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ramachander Rao: అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తా: రామచందర్‌రావు

ABN, Publish Date - Jun 30 , 2025 | 10:45 AM

Ramachander Rao: పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవని మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.

Ramachander Rao

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ బీజేపీ కొత్త బాస్ (Telangana BJP New President) ఎవరనేదానిపై మరికొద్ది గంటల్లోనే సస్పెన్స్ వీడనుంది. ఇప్పటికే ఆశావాహుల్లో అనేక మంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు (Former MLC Ramachandar Rao) పేరును జాతీయ నాయకత్వం ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో రామచందర్ రావు మాట్లాడుతూ.. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు నామినేషన్ వేయబోతున్నట్లు తెలిపారు. దాని కంటే ముందు పార్టీలోని పెద్దలతో మాట్లాడాలన్నారు.

జాతీయ నాయకత్వం నుంచి తనకు అధికారికంగా రాగానే అఫీషియల్‌గా ప్రకటన చేస్తామని చెప్పారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు వెల్లడించారు.

ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నిన్న (ఆదివారం) నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు పేరు దాదాపుగా ఖరారైంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ఒక్కరే నామినేషన్ వేయనున్నారు. బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ కేంద్రమంత్రి శోభా కరండ్లజే సమక్షంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రామచందర్‌రావు నామినేష‌న్‌ను రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీ నారాయణ స్వీకరించనున్నారు. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన రామచందర్ రావుకే సంఘ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. రేపు (మంగళవారం) రామచందర్ రావు పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

యాంకర్‌ స్వేచ్ఛ సూసైడ్‌పై పూర్ణచందర్‌ భార్య షాకింగ్ కామెంట్స్..

నాకు రాజకీయ అండదండలున్నాయ్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 01:12 PM