TG Police:హైదరాబాద్‌లో హెరాయిన్ స్వాధీనం.. ఒకరు అరెస్ట్
ABN, Publish Date - Jul 02 , 2025 | 09:51 PM
హైదరాబాద్‌లో హెరాయిన్ విక్రయించేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ డ్రగ్స్ విలువ రూ. 1.10 కోట్లు ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్, జులై 02: నగర శివారులోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 650 గ్రాముల హెరాయిన్‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ రూ. 1.10 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితుడు రాజస్థాన్‌కు చెందిన రాజారాంగా గుర్తించామన్నారు. ఈ హెరాయిన్‌ను విక్రయించేందుకు అతడు రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చాడని తమ విచారణలో వెల్లడించారన్నారు.
నర్సింగ్ పరిసర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఇటీవల ఓ చర్చ అయితే సాగుతుంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఎస్‌ఓటీ పోలీసులు నిఘా పెంచారు. దీంతో హెరాయిన్ విక్రయించేందుకు వచ్చిన రాజారాంను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. మరోవైపు నగరంలో డ్రగ్స్ వినియోగంపై ఉక్క పాదం మొపుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది.
కానీ ప్రతి రోజు.. నగరంలో ఎక్కడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు ఇలా డ్రగ్స్ విక్రయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
విచారణకు హాజరు.. షాక్‌లో ఆరా మస్తాన్
సిగాచి పేలుడుపై కమిటీ ఏర్పాటు.. నివేదికకు గడువు విధించిన సర్కార్
ఐపీఎస్‌కి రాజీనామా.. ఎందుకంటే..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 02 , 2025 | 09:57 PM