CM Revanth Reddy: బెదిరిస్తే బెదరడానికి ఎవరూ లేరు
ABN, Publish Date - Feb 28 , 2025 | 07:10 PM
CM Revanth Reddy: మోదీ ప్రభుత్వంతోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి వ్యవహార శైలిని ఆయన ఎండగట్టారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి బెదిరిస్తే బెదరడానికి ఇక్కడ ఎవరు లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి సైందవ పాత్ర పోషిస్తున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు చీకటి మిత్రులు అని అభివర్ణించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశానంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోన్న ప్రాజెక్ట్‌లకు అనుమతులు ఇస్తేనే తెలంగాణకు రావాలని కిషన్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. కేంద్రం ప్రత్యేకంగా తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదన్నారు. ఇన్ని సార్లు ముఖ్యమంత్రి వచ్చి అడుగుతోన్నా.. మీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం తమను ఎందుకు అడగడం లేదని మోదీ కేబినెట్‌లోని మంత్రులు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ద్వారా బలమైన పునాదులు వేస్తామన్నారు. పేద వారికి కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉండేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించామని చెప్పారు. కార్యకర్త మనసు ఎరిగిన నాయకురాలు మీనాక్షీ నటరాజన్ అని ఆయన తెలిపారు.
Also Read: భవిష్యత్తులో ఏపీలో రాబోయే మార్పులు చెప్పిన పవన్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న విధానం చూస్తే తనకు నవ్వొస్తుందన్నారు. తాము అడుగుతోంది ప్రధాని మోదీ ఆస్తి కాదన్నారు. తాము కట్టిన పన్నుల నుంచి తమకు నిధులు ఇవ్వమని మాత్రమే అడుగుతున్నామన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్‌కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణకి ఇవ్వరా? అని మోదీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు.
Also Read: మీరు ప్రయాణిస్తున్న రైలులో ఛార్జింగ్ సాకెట్ పనిచేయడం లేదా.. ఇలా చేస్తే క్షణాల్లో ..
Also Read: Fact Check : రూ.3 వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.. కొందామనుకొంటున్నారా
మూసీకి నిధుల ఇవ్వమంటే ఎందుకంత అసహనమంటూ బీజేపీ నేతల వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మెట్రో ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వమంటే ఇవ్వడం లేదన్నారు. మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డును కేంద్ర క్యాబినెట్ ఎజెండాలో ఎందుకు పెట్టడం లేదంటూ బీజేపీ అగ్రనేతలను ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. కేంద్రం ప్రత్యేకంగా తెచ్చిన ప్రాజెక్టు ఒక్కటైనా తెలంగాణలో ఉందా? అని ప్రశ్నించారు.
Also Read: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు
దమ్ముంటే ఏపీలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండంటూ కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు .. బీసీ కేటగిరిలో ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్నికల కోసం మంద కృష్ణను బీజేపీ కౌగిలించుకుందన్నారు. అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదంటూ బీజేపీ నేతలను ఆయన బల్లగుద్దీ మరి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డు పడడం వల్లే తెలంగాణకి అన్యాయం జరుగుతోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
For Telangana News And Telugu News
Updated Date - Feb 28 , 2025 | 07:28 PM