Train Journey: మీరు ప్రయాణిస్తున్న రైలులో ఛార్జింగ్ సాకెట్ పనిచేయడం లేదా.. ఇలా చేస్తే క్షణాల్లో పని చేస్తుంది..
ABN , Publish Date - Feb 28 , 2025 | 05:30 PM
Train Journey: రైలు ప్రయాణంలో మీ బెర్త్ వద్ద నున్న సెల్ ఫోన్ ఛార్జర్ పిన్ పని చేయడం లేదా? చాలా సింపిల్. జస్ట్ ఇలా చేశారంటే.. చాలు. రైలులోని ఎలక్ట్రిషియన్ మీ ముందు ప్రత్యక్షమవుతాడు. అయితే రిజర్వేషన్ చేసుకున్న వారే కాదు.. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే వారు సైతం ఇలా చేయండి చాలు.
దేశంలో అన్నింటి ధరలు వేగంగా పెరుగిపోతున్నాయి. వాటిలో బస్సు, కారు, విమానం తదితర రవాణా సాధనాలు ఉన్నాయి. కానీ వీటి ధరలు ఎంత వేగంగా పెరిగినా.. రైలు ఛార్జీల ధరలు మాత్రం అంతగా పెరగవు. అందుకే దేశంలో దాదాపు 80 శాతం మంది ప్రజలు.. వీటిలో ప్రయాణించేందుకు మక్కువ చూపుతారు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద సెల్ ఫోన్ ఉంటుంది. దీంతో రైళ్లలో ఏసీ, స్లీపర్ బోగీల్లోనే కాదు.. జనరల్ బోగిల్లో సైతం రైల్వే శాఖ ఈ సౌకర్యాన్ని కల్పించింది.
దీంతో బోగీల్లోకి ఎక్కగానే ప్రయాణికుల్లో చాలా మంది తమ సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టుకొంటారు. ఓ వేళ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితే.. సాకెట్ పని చేయడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి. అదీకాక ట్రయిన్ ఎక్కిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఫోన్‌లో ఛార్జింగ్ లేదు. పక్క వారి ఫోన్ అడిగితే వారు ఏమనుకుంటారో అని సంశయం కలుగుతోంది.
అలాంటి వేళ.. ఓ విధమైన ఆందోళన మనలో నెలకొంటుంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని పేరు రైల్ మద్దద్ (RailMadad) పోర్టల్. ఈ పోర్టల్‌లోకి (railmadad.indianrailways.gov.in)వెళ్లి క్లిక్ చేయడం ద్వారా నేరుగా పోర్టల్‌లోకి ప్రవేశించవచ్చు. ఇందులో తొలుత గ్రీవియన్స్ డిటైల్స్ ఉంటాయి.
Also Read: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు
అవి ఇలా స్టెప్ బై స్టెప్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ముందు మీ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. గెట్ ఓటీపీ అని ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి
మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది.
దానిని ఎంటర్ చేయాలి
ప్రయాణ వివరాలు నమోదు చేయాలి..
పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి లేకుంటే జనరల్ కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికులు సైతం నమోదు చేయవచ్చు.
టైప్... సెలక్ట్ అని వస్తుంది. దానిలో కిందకు ఉన్న యారో (గుర్తు)పై క్లిక్ చేయాలి.
సబ్ టైప్ అని ఉంటుంది. అందులో ఛార్జింగ్ పిన్ సాకెట్‌పై క్లిక్ చేయాలి.
మీరు ఏ రోజు ప్రయాణిస్తున్నారో.. ఆ రోజును క్లిక్ చేయాల్సి ఉంటుంది.
మీ సమస్యను ఫొటో తీసి అప్ లోడ్ చేయవచ్చు. ఛార్జింగ్ పిన్ పనిచేయడం లేదని.. దానిని ఫొటో తీసి అందులో పోస్ట్ చేయవచ్చు.
గ్రీవియన్స్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది.
అందులో మీ సమస్యలను రాత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.
అనంతరం సబ్ మీట్ మీద క్లిక్ చేయాలి.
Also Read: Fact Check : రూ.3 వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.. కొందామనుకొంటున్నారా
ఇలా చేసిన కొన్ని నిమిషాల్లోనే.. మీ సమస్యకు పరిష్కారం అవుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రైలు ప్రయాణిస్తుంటే.. అందులో ఎలక్ట్రిషియన్లు ఉంటారు. వారికి రైల్వే శాఖ సమాచారం అందింస్తుంది. ఆ వెంటనే మీ సమస్య పరిష్కారమవుతోంది. గతంలో మీకు ఏదైనా సమస్య ఉంటే.. ట్విట్టర్‌లో రైల్వే శాఖకు సమాచారం అందిస్తే.. స్పందించే వారు. కానీ ప్రస్తుతం రైల్ మదద్ పోర్టల్‌ను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. దీని ద్వారా చాలా సమస్యలను పరిష్కరించుకొనే అవకాశముంది.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..