Chilukur Temple RangaRajan: రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. కీలక ఆదేశాలు
ABN, Publish Date - Feb 10 , 2025 | 07:26 PM
Chilukur Temple RangaRajan: చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు ఆ పార్టీ కీలక నేతలు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 : మొయినాబాద్ మండలం చిలుకూరు శ్రీబాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రంగరాజన్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఫోన్‌లో పరామర్శించారు. ఆ దాడికి సంబంధించిన వివరాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి దాడులను సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు రంగరాజన్‌ను ఆయన నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఆ పార్టీ అగ్రనేతలు పరామర్శించారు. ఈ దాడి ఘటనను బీఆర్ఎస్ నేతలు ఖండించారు.
రాజేంద్రనగర్ డీసీపీ మాట్లాడుతూ..
మరోవైపు.. చిలుకూరు శ్రీబాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడికి సంబంధించిన అంశాలను రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో వివరించారు. ప్రధాన నిందితుడు కొవ్వూరి వీర రాఘవరెడ్డిని రిమాండ్‌కు తరలించామన్నారు. ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు, తన సంస్థలో హిందువులను చేర్పించాలంటూ రంగరాజన్‌పై రామరాజ్యం సంస్థ దాడి చేసిందని తెలిపారు.
అయితే 2022లో రామరాజ్యం పేరుతో సోషల్ మీడియాలో సంస్థను కొవ్వూరి వీర రాఘవ రెడ్డి ప్రారంభించారని చెప్పారు. ఆ క్రమంలో సోషల్ మీడియాలో భగవద్గీత శ్లోకాలతో పాటు హిందువులు.. ఈ సంస్థలో చేరే విధంగా వీడియోలు పోస్ట్ చేశాడన్నారు. ఈ సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ. 20 వేలు జీతం ఇచ్చే విధంగా ప్రకటనలు చేశాడని తెలిపారు.
Also Read: అప్పు చేయడం తప్పు కాదు కానీ..
ఈ నేపథ్యంలో రాఘవ రెడ్డి మాటలు నమ్మి దాదాపు 25 మంది ఈ రామరాజ్యం ఆర్మీలో చేరారన్నారు. ఈ జనవరి 24వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు పట్టణంలో వీళ్ళంతా సమావేశమయ్యారని వివరించారు. ఇక గుంటూరు జిల్లా కోటప్పకొండలో తల రూ. 2 వేలు చెల్లించి యూనిఫామ్ కుట్టించుకున్నారని తెలిపారు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?
అయితే ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం వీరంతా చిలుకూరుకు మూడు వాహనాల్లో వెళ్లి.. రంగరాజన్‌పై దాడి చేశారన్నారు. అయితే వీరంతా ఈ దాడికి పాల్పడే ముందు యాప్రాల్‌లో కలిసి ఫోటోలు దిగారన్నారు. నల్లని దుస్తులు ధరించిన 20 నుంచి 25 మంది రంగరాజన్ నివాసానికి మూడు వాహనాల్లో వచ్చారని చెప్పారు. ఆర్థికంగా సపోర్ట్ చేయడంతోపాటు "రామరాజ్యం ఆర్మీ"లో వ్యక్తులను రిక్రూట్ చేయాలంటూ రంగరాజన్‌ను వారు డిమాండ్ చేశారన్నారు.
Also Read: ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. జగన్ వస్తారా?
అందుకు ఆయన అంగీకరించ లేదన్నారు. దీంతో ఆయనపై దాడి చేశారని.. దీంతో ఫిబ్రవరి 8వ తేదీన తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. అయితే అదే రోజు.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అలాగే ఈ రోజు.. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళలతోపాటు ఐదుగురిని అరెస్టు చేసామని వివరించారు.
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
చిలుకూరు శ్రీబాలాజీ దేవాలయం తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో స్వామి వారిని దర్శించుకొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. అలాంటి దేవాలయంలో రంగరాజన ప్రధాన అర్చకుడిగా ఉన్నారు. ఆయన తండ్రి సౌందర్ రాజన్ సైతం ఇదే దేవాలయంలో అర్చకునికా విధులు నిర్వహించారు. ఇక ఈ దేవాలయం ప్రధాన అర్చకుడి రంగరాజన్ పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం విధితమే.
For Telangana News And Telugu News
Updated Date - Feb 10 , 2025 | 08:02 PM