ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy:కాంగ్రెస్ మాట ఇస్తే.. ఎప్పటికీ వెనక్కి తగ్గదు

ABN, Publish Date - Jan 26 , 2025 | 04:33 PM

CM Revanth Reddy: కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి.. పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

CM Revanth Reddy

నారాయణపేట జిల్లా: రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏళ్ల తరబడి ఎన్నో పథకాలను అన్నదాతల కోసం కాంగ్రెస్ అమలు చేసిందని అన్నారు. భూమికి, విత్తనానికి ఎలాంటి అనుబంధం ఉంటుందో.. అదే స్థాయిలో రైతుకు కాంగ్రెస్ పార్టీకి అంతంటి అనుబంధం ఉందని తెలిపారు. నేడు నాలుగు సంక్షేమ పథకాలను రాష్ట్రానికి కొడంగల్ నుంచి అంకితం చేస్తున్నామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు .. రైతు భరోసా, రేషన్ కార్డులు మార్చ్ 31 దాకా రాష్ట్రంలోని ప్రతీ లబ్ధిదారుడికి అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


కొడంగల్‌కు న్యాయం జరగలేదు..

నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో ఇవాళ(ఆదివారం) 4 పథకాలను సీఎం రేవంత్‌ ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులను సీఎం రేవంత్‌‌రెడ్డి అందజేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చెక్కులను, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ నాలుగు సంక్షేమ పథకాలను ఇక్కడి నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ పథకాలను చంద్రవంచ నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2023 దాకా కొడంగల్‌కు జరగాల్సిన స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో తాను సీఎం అయ్యానని.. తాను ఇప్పుడు సమయం కేటాయించ లేకపోయినా.. కొడంగల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.


రుణమాఫీ చేశాం..

దేశమంతటా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్పారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఒక్క సంతకంతో దేశమంతా రుణమాఫీ చేశారని గర్తుచేశారు. రైతులకు ఒకే విడతలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. సాగు ఖర్చులు పెరిగాయని రైతు భరోసా నిధులు పెంచామన్నారు. ఏడాదికి ఎకరాకు రూ.12వేలు చొప్పున రైతు భరోసా ఇస్తున్నామని తెలిపారు. ఇవాళ ఆదివారం కాబట్టి రైతుభరోసా డబ్బులు జమకావు అని చెప్పారు. అర్ధరాత్రి 12 దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భూమిలేని వారిని కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారని గుర్తుచేశారు.


గత ప్రభుత్వం రేషన్‌కార్డులు ఇవ్వలేదు

భూమిలేని పేదలను ఆదుకునేందుకు రైతుభరోసా తీసుకువచ్చామన్నారు. కూలీ పనిచేసే పేదలకు రైతుభరోసా కింద రూ.12 వేలు ఇస్తున్నామని అన్నారు. గత పదేళ్లలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు రాలేదని చెప్పుకొచ్చారు. గత పదేళ్లలో గ్రామాల్లో ఎవరికైనా డబుల్‌బెడ్‌రూం ఇళ్లు వచ్చాయా? అని ప్రశ్నించారు. పేదలు ఇల్లు నిర్మించకుంటే రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు రేషన్‌కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. రేషన్‌కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సభల ద్వారా రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. గ్రామ సభల ద్వారా గ్రామాలకు అధికారులను పంపిస్తున్నామన్నారు. గతంలో ఏదైనా కావాలంటే ఎవరైనా ఫాంహౌస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు ప్రజల దగ్గరకే ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రజల సమక్షంలోనే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని అన్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటోందని చెప్పారు.


నిరంతరం కృషి చేస్తాం..

‘‘ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి. రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఇచ్చిన గ్యారంటీలను అమలుచేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎంతోమంది పేదలు కొత్త రేషన్‌కార్డులు కోసం ఎదురుచూపులు. రైతు కూలీలు ప్రభుత్వ అండ కోరుకుంటున్నారు. రైతు భరోసాతో ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నాం. పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రైతులతో కాంగ్రెస్‌ ప్రభుత్వానిది విడదీయరాని అనుబంధం. రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్సే. 2024 ఆగస్టు 15న రూ.21వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాం. 25.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21వేల కోట్లు జమ. ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే 55,147 ఉద్యోగాలు ఇచ్చాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.


కాళేశ్వరం మూడేళ్లకే కూలింది..

‘‘ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే.. ఎప్పటికీ వెనక్కి తగ్గదు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉండి.. పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేయలేదు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. కాళేశ్వరం కూలిపోయినా.. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రతిపక్ష నేత సభకు రాని దుస్థితిని ఏమనాలి. ప్రతిపక్ష నేతగా బాధ్యత నిర్వర్తించినప్పుడు ఆ పదవి ఎందుకు. మనం ఎన్నుకున్న సర్పంచ్‌ గ్రామంలో లేకుంటే ఎలా ఉంటుంది. ప్రాజెక్టుల కోసం భూ సేకరణ చేస్తే ప్రజలను రెచ్చగొడుతున్నారు. మన ప్రజలకు ఉపాధి కోసం పరిశ్రమలు తేవాలని భావించా. మాయమాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి పరిశ్రమలు అడ్డుకున్నారు. నా సోదరుడు ప్రజా సేవ చేస్తుంటే.. ఏం పదవి ఉందని అంటున్నారు. కేసీఆర్ కుటుంబం వల్లే మా ఇంట్లో అందరూ పదవులు పొందలేదు. సోదరులు, బంధువులు అందరికీ పదవులు ఇస్తేనే.. మంచిదా? కుటుంబం అంతటికీ పదవులు ఇచ్చి దోపిడీ చేసే వ్యక్తిని కాదు. కేసీఆర్ తన కుటుంబానికి, బంధువులకు పదవులు ఇచ్చారు. కేసీఆర్ కుమార్తె ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ చేశారు. పేదలంతా ఎక్కడ ఉన్నా.. రేషన్‌కార్డు తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: మమ్మల్ని అవమానిస్తారా.. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..

Karimnagar: మళ్లీ హల్‌చల్ చేసిన నాగసాధు అఘోరీ.. ఈసారి ఏం చేసిందంటే..

Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్‌ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 26 , 2025 | 04:43 PM