ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth: ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం రేవంత్, కాసేపట్లో శాఖల కేటాయింపు

ABN, Publish Date - Jun 11 , 2025 | 06:36 PM

ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్నారు. కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ప్రకటన జరిగే అవకాశం ఉంది. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు..

CM Revanth

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్నారు. కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ప్రకటన జరిగే అవకాశం ఉంది. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు సీఎం రేవంత్ కేటాయించబోతున్నారు. అయితే, ఎవరికి ఏయే శాఖలు కేటాయిస్తారన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. వివేక్‌కు న్యాయ, క్రీడలు, కార్మిక శాఖలు కేటాయించే ఛాన్స్‌ ఉంది. ఎ.లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. వాకిటి శ్రీహరికి పశు సంవర్థక శాఖ కేటాయించే అవకాశం ఉందంటున్నారు.

అయితే, మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై పార్టీ హైకమాండ్‌తో ఎలాంటి చర్చ జరగలేదన్నారు సీఎం రేవంత్. అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామన్నారు. తన దగ్గరున్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయిస్తానని సీఎం తేల్చి చెప్పడంతో సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పులు లేవని చెప్పకనే చెప్పినట్టైంది. సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరున్న హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో పాటు కీలకమైన 11 శాఖలు ఉన్నాయి. కొత్త మంత్రులకు ఆయా శాఖలను ఇవ్వనున్నారు. దీనిపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రాత్రి లేదా రేపు(గురువారం) నాటికి శాఖల కేటాయింపు‌పై అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి.

ఇవి కూడా చదవండి..

రాజాతో పెళ్లి.. తల్లికి ముందే వార్నింగ్ ఇచ్చిన సోనమ్..

తిరువణ్ణామలైలో మాంసాహార భోజనం..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 07:56 PM