Hyderabad: బీ అలర్ట్.. హైదరాబాద్ లోని ఈ రూట్‌పై ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే..
ABN, Publish Date - May 13 , 2025 | 01:27 PM
హైదరాబాద్‌లోని పాతబస్తీలో మిస్ వరల్డ్-2025 పోటీదారులు నేడు హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఈ నేపధ్యంలో రేవంత్ ప్రభుత్వం పాతబస్తీలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించింది.
మిస్ వరల్డ్-2025 పోటీదారుల హెరిటేజ్ వాక్ సందర్భంగా నేడు పాతబస్తీలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రపంచ సుందరాంగులు చార్మినార్ నుంచి లార్డ్ బజార్ వరకు పరిసర ప్రాంతాలను సందర్శించనుండటంతో రేవంత్ ప్రభుత్వం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. మదీనా నుండి చార్మినార్, చార్మినార్ నుండి శాలిబండ వెళ్లే మార్గాలను మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు చేపట్టింది.
నయాపూల్ నుండి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అధికారులు మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజ్ వైపు మళ్లించనున్నారు. హిమత్పురా నుండి వచ్చే ట్రాఫిక్‌ను వోల్గా జంక్షన్ వైపు దారి మళ్లించనున్నారు. పురాణాపూల్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను సిటీ కాలేజ్, ఫతే దర్వాజా వైపు ద్వారా దారి మళ్లిస్తున్నారు. హెరిటేజ్ వాక్ నేపధ్యంలో అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే చార్మినార్ పరిసర ప్రాంతాలను బాంబు, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేశారు.
దాదాపు 4 ప్రత్యేక బస్సుల్లో చార్మినార్‌కు చేరుకునే సుందరీమణులకు మార్ఫా వాయిద్యాలతో ఘన స్వాగతం పలికేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ నేపధ్యంలోనే చార్మినార్ వద్ద మిస్ వరల్డ్-2025 పోటీదారులకు ప్రత్యేకంగా ఫోటో షూట్ నిర్వహించనున్నారు. అనంతరం, చార్మినార్ సమీపంలోని చుడీ బజారులో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల తయారు విధానాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు వారు షాపింగ్ కూడా చేస్తారు.
Also Read:
Viral Video: యువతిపై బీరు ప్రాంక్.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
Viral Fevers: సీజన్ కాకున్నా.. వ్యాపిస్తున్న వైరల్ జ్వరాలు
Husband Catches Wife: ప్రియుడితో ఇంట్లో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
Updated Date - May 13 , 2025 | 02:54 PM